Chandrababu Naidu: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. గుడివాడలో మినీ మహానాడు..

ఈనెల 29న గుడివాడలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ నిర్వహించే మినీ మహానాడులో టీడీపీ అధినేత పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Chandrababu Naidu: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. గుడివాడలో మినీ మహానాడు..
Chandrababu Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 23, 2022 | 6:10 AM

Chandrababu Naidu Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటనకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 29న గుడివాడలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ నిర్వహించే మినీ మహానాడులో టీడీపీ అధినేత పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు బహిరంగ సభకు స్థలాలను కూడా మాజీమంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో నాలుగు ప్రాంతాలను రవీంద్ర పరిశీలించారు. లక్షలాది మందితో గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. చంద్రబాబు బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

30న మచిలీపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం అవుతారని తెలుస్తోంది. అటు గుంటూరు జిల్లాలోనూ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. జూలై 1న ప్రత్తిపాడులో, పొన్నూరులో చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ప్రజల భవిష్యత్‌కు భరోసా కల్పించేలా చంద్రబాబు జిల్లాల ప‌ర్యటన ఉంటుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఏడాది పాటు 100కు పైగా అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల్లో ప‌ర్యటిస్తానని గతంలోనే ప్రకటించారు చంద్రబాబు.

ఈ నేపథ్యంలోనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. వీటి తర్వాత ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు లేదా, రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన ఉండనున్నట్టు సమాచారం. జిల్లాల పర్యటనలు, పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా చంద్రబాబు షెడ్యూల్‌ను రూపొందించారు టీడీపీ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!