Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honour Killing: అత్తే అల్లుడిని చంపించింది.. మురళి హత్య కేసులో సంచలన విషయాలు..

తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడని, 10 లక్షల సుపారీ ఇచ్చి యశోద హత్యచేయించింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతులకు చిట్ర మురళి ఒక్కగానొక్క కొడుకు

Honour Killing: అత్తే అల్లుడిని చంపించింది.. మురళి హత్య కేసులో సంచలన విషయాలు..
Honour Killing
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 23, 2022 | 6:00 AM

Honour killing in Rapthadu: పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, అనంతపురం రాప్తాడులో జరిగిన మురళిది పరువు హత్యగా నిర్ధారించారు పోలీసులు. ఈ కేసులో మురళి అత్త యశోద సహా మరో 8 మందిని రాప్తాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడని, 10 లక్షల సుపారీ ఇచ్చి యశోద హత్యచేయించింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతులకు చిట్ర మురళి ఒక్కగానొక్క కొడుకు. ఇతను పీజీ పూర్తి చేసి, పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అదే గ్రామానికి చెందిన వీణ డిగ్రీ పూర్తి చేసింది. మూడేళ్ల కిందట గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం పొంది, ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది.

మురళి, వీణ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ గత ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు దూరంగా జీవించాలనుకుని దంపతులిద్దరూ అనంతపురం జిల్లా రాప్తాడుకు మకాం మార్చారు. అయినా వీరిని వదల్లేదు. గత గురువారం రాప్తాడు వై జంక్షన్‌ వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి మురళిని బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత హత్య చేశారు.

రాప్తాడు మండలం లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య శవాన్ని పడేశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు సీరియస్‌ ఫోకస్‌ పెట్టి ఛేదించారు. అత్త యశోదనే ప్రధాన నిందితురాలిగా తేల్చారు. తమ ప్రేమ వివాహం ఇష్టం లేకనే, తన తల్లి మురళిని హత్య చేయించిందని వీణ పేర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..