Hyderabad: తల్లి చనిపోయిందని మనస్థాపం.. చివరకు అన్నదమ్ములు ఏం చేశారంటే..?
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి అన్నదమ్ములు. వారి తల్లి ప్రమీల 9 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
Brothers commit suicide: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కీసర పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి అన్నదమ్ములు. వారి తల్లి ప్రమీల 9 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన యాదిరెడ్డి, మహిపాల్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో యాదిరెడ్డి (34) ఉరేసుకోగా, తమ్ముడు మహిపాల్ రెడ్డి (29) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, పలు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..