AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajini Kanth: సినిమా చూసి హీరోకు నేరుగా కాల్ చేసిన రజినీకాంత్.. మురిసిపోయిన రక్షిత్ శెట్టి..

ఈరోజు చాలా అద్భుతంగా ప్రారంభమైంది.. సూపర్ స్టార్ రజినీకాంత్ సర్ నుంచి కాల్ వచ్చింది.. ఆయన గత రాత్రి 777 చార్లీ సినిమాను చూశారు.. సినిమా మేకింగ్, క్వాలిటీ.. తెరకెక్కించిన విధానం..

Rajini Kanth: సినిమా చూసి హీరోకు నేరుగా కాల్ చేసిన రజినీకాంత్.. మురిసిపోయిన రక్షిత్ శెట్టి..
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2022 | 6:12 AM

Share

ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యథిక వసూళ్లు సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సినిమా 777 చార్లీ (777 Charlie). కిరిక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 777 చార్లీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి ఎమోషనల్ అయ్యారు.. ముఖ్యంగా ఈ మూవీ చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సైతం కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. చార్లీ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.. తాజాగా ఈ సినిమా చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం హీరో రక్షిత్ శెట్టిపై ప్రశంసలు కురింపించారట.. ఈ విషయాన్ని హీరో రక్షిత్ శెట్టి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు..

” ఈరోజు చాలా అద్భుతంగా ప్రారంభమైంది.. సూపర్ స్టార్ రజినీకాంత్ సర్ నుంచి కాల్ వచ్చింది.. ఆయన గత రాత్రి 777 చార్లీ సినిమాను చూశారు.. సినిమా మేకింగ్, క్వాలిటీ.. తెరకెక్కించిన విధానం.. క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు.. ఆధ్యాత్మిక కోణంలో క్లైమాక్స్ తెరకెక్కించడం బాగుంది.. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి మాటలు వినడం అద్భుతంగా ఉంది.. రజినీకాంత్ సర్ కు ధన్యవాదాలు” అంటూ ట్వీ్ట్ చేశారు రక్షిత్ శెట్టి.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చక్కగా, హృద్యంగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు కె. కిరణ్‌ రాజ్‌. కన్నడతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 10న ఈ సినిమా విడుదలైంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే..ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆగస్టు రెండో వారం నుంచి డిజిటల్‌ ప్రేక్షకులకు అందుబాటులో రానుందని సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో