Vastu Tips: ఈ చిట్కాలను పాటించండి.. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి..

ఆత్మవిశ్వాసం పెంపించుకోవడానికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా.. మీరు మీ జీవితంలో ఆనందాన్ని , సంపదను పొందవచ్చు.

Vastu Tips: ఈ చిట్కాలను పాటించండి.. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 19, 2022 | 4:17 PM

Vastu Tips: విజయం  సాధించాలంటే ఎవరైనా సరే కష్టపడి పని చేయాల్సిందే. అయితే  చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినా సక్సెస్ సొంతం కాదు జీవితంలో సంతోషం(Happiness in life) లభించదు.  ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. మీలో ఆత్మవిశ్వాసం (Self confidence) లేకుంటే…  సమస్యలను ఎదుర్కోనే సమయంలో ఇబ్బంది పడాల్సిఉంటుంది. ఆత్మవిశ్వాసం లేకపోవడం పనిలో అడ్డంకులను సృష్టిస్తుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసం లోపంతో బాధపడుతున్న వ్యక్తి ఏ పనిని సరిగ్గా చేయలేడు. చాలామంది వ్యక్తులు ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే సమయాన్ని వృధా చేయడం వల్ల పోటీలో ఇతరుల కంటే చాలా వెనుకబడి ఉంటారు.  దీని కోసం మీరు కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.. అయితే ఆత్మవిశ్వాసం పెంపించుకోవడానికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా.. మీరు మీ జీవితంలో ఆనందాన్ని , సంపదను పొందవచ్చు. మీరు కూడా అలాంటి వాస్తు నివారణల కోసం చూస్తున్నట్లయితే.. ఈరోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడే వాస్తు నివారణల చర్యల గురించి తెలుసుకుందాం..

గదిలో చేయాల్సిన మార్పులు:  ఇంట్లో ఏదైనా ఖాళీ గోడకు అభిముఖంగా కూర్చోవడం వల్ల ఆత్మవిశ్వాసం కలుగుతుంది.  ముఖ్యంగా కూర్చోవడానికి లివింగ్ రూమ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తాము.. కనుక లివింగ్ రూమ్ లో చిన్న మార్పు చేసుకుని విశ్వాసం లేకపోవడాన్ని అధిగమించవచ్చు. గదిలో నడుస్తున్న గుర్రం చిత్రాన్ని ఉంచండి. గుర్రాలు శ్రమకు చిహ్నంగా భావిస్తారు. గుర్రపు బొమ్మను గదిలో ఉంచడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది. చిత్రాన్ని ఉంచేటప్పుడు, గుర్రం చిత్రంలో నడుస్తున్నట్లు ఉండాలనే విషయం గుర్తుంచుకోండి.

సూర్య భగవానుని ఆరాధన ఆత్మవిశ్వాసం పెరగాలంటే సూర్యభగవానుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఉదయించే సూర్యుడు విజయం, కృషినిగుర్తు. అందుకే ప్రజలు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సూర్యభగవానుని ఆరాధించడం మరియు పూజించడం ద్వారా మీరు అతని అనుగ్రహాన్ని పొందవచ్చు, అయితే ఇంట్లో ఉదయించే సూర్యుని చిత్రం ఉండటం కూడా శుభప్రదం. ఈ చిత్రాన్ని చూస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు..  మీ ముఖం తూర్పు వైపు ఉండాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

చేపల అక్వేరియం: ప్రస్తుతం ఇంట్లో చేప అక్వేరియం అందంకోసం ఏర్పాటు చేసుకుంటున్నారు.  అయితే  ఈ  అక్వేరియం ఉంచడం ద్వారా.. విశ్వాసాన్ని పొందవచ్చు. వాస్తు ప్రకారం.. చేప అక్వేరియం ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించడానికి సహాయపడుతుంది. అక్వేరియంలో కనీసం రెండు గోల్డ్ ఫిష్ లను ఉంచండి. క్రమం తప్పకుండా వాటికీ ఆహారాన్ని అందించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)