తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం.. వివిధ ట్రస్టులకు గానూ రూ.కోట్లలో అందజేసిన భక్తులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మరోసారి భారీగా విరాళాలు అందాయి. శ్రీవారికి చెందిన వివిధ ట్రస్ట్‌లకు శనివారం రూ.2.53 కోట్లు విరాళంగా అందింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మరోసారి భారీగా విరాళాలు అందాయి. శ్రీవారికి చెందిన వివిధ ట్రస్ట్‌లకు శనివారం రూ.2.53 కోట్లు విరాళంగా అందింది. టీవీఎస్ సంస్థ చైర్మన్ సుదర్శన్.. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.1.05 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో దాత తరఫున ప్రతినిధి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన జీవీఆర్ ఇన్‌ఫ్రా సంస్థ తరఫున బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.1.26 కోట్లు అందింది.
అలాగే హరిబాబు, వెంకటేశ్వర్లు అనే భక్తులు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అందజేశారు. ఎన్.రవిబాబు అనే భక్తుడి నుంచి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.2.50 లక్షలు అందింది. విరాళాలను తిరుమలలోని దాతల విభాగంలో డిప్యూటీ ఈవో పద్మావతికి అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్‌లో టీబీ కౌంటర్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది.