Vastu Tips: ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా.. ఆర్ధిక ఇబ్బందులా.. ఈ వాస్తు టిప్స్ పాటించి చూడండి..

డబ్బు, ఇతర సమస్యలను తొలగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు ఇవ్వబడ్డాయి. చేతిలో డబ్బు నిలబడదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంటి మెయిన్ గేట్‌కి సంబంధించి కొన్ని వాస్తు చర్యలు చేపట్టాలి.

Vastu Tips:  ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా.. ఆర్ధిక ఇబ్బందులా.. ఈ వాస్తు టిప్స్ పాటించి చూడండి..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 24, 2022 | 6:40 PM

Vastu Tips: ఎంత డబ్బు సంపాదించినా.. ఎంత కష్టపడినా.. కొంతమంది చేతుల్లో డబ్బు నిలవదు. డబ్బు వారి జేబులో ఉండదు. కష్టపడిన సొమ్ము అంటూ.. బహుజాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ.. కొంతమందిని డబ్బు ఇబ్బందులను  ఎదుర్కోవలసి ఉంటుంది. చూస్తే.. దీని వెనుక ఏదోక కారణం ఉండి ఉండవచ్చు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం .. ఒక  దోషం ఆ వ్యక్తిపై ఆర్థికంగా , శారీరకంగా ప్రభావితం చేస్తుంది. వాస్తు నియమాలను విస్మరించడం వల్ల ఏర్పడిన లోపం మిమ్మల్ని చాలా కాలం పాటు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేలా చేస్తుంది. జీవితంలో లేదా ఇంట్లో ఉన్న లోపాలే డబ్బుకు సంబంధించిన సమస్యలకు కారణం కావచ్చనే ఆలోచన చాలామందికి ఉండదు. డబ్బు , ఇతర సమస్యలను తొలగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు ఇవ్వబడ్డాయి. చేతిలో డబ్బు నిలబడదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంటి మెయిన్ గేట్‌కి సంబంధించి కొన్ని వాస్తు చర్యలు చేపట్టాలి. ఈరోజు ఈ నివారణల గురించి తెలుసుకుందాం..

వినాయకుడి చిత్ర పటం: సానుకూల లేదా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం ప్రధాన మార్గం. కనుక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తీసుకున్న చర్యలు ఇంట్లో సుఖ సంపదలను కలిగిస్తాయి. వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారంపై గణపతి బొమ్మను ఉంచడం చాలా శ్రేయస్కరం. శుభానికి చిహ్నంగా భావించే గణేష్ చిత్రం కారణంగా, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. ప్రధాన ద్వారంపై చిత్రపటం పెట్టడం వల్ల శుభ యోగం ఏర్పడుతుందని నమ్మకం.

జమ్మి మొక్క ఇంట్లో జమ్మి మొక్క హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో, ఈ పవిత్ర మొక్క సంబంధం శని దేవుడితో  ఉందని చెప్పబడింది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర జమ్మి మొక్కను నాటడం ద్వారా మీ జీవితంలోని చెడు కాలం తొలగిపోతుందని నమ్మకం. శని అనుగ్రహం పొందడం వల్ల ప్రతికూల శక్తి కూడా మీకు దూరంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఈ మొక్కకు నీరు పోయడం.. శుభ్రం చేయడం ద్వారా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సూర్యుని ఫోటో సూర్య భగవానుని ఆరాధించడం వల్ల మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ప్రతికూలత లేకుంటే ఎలాంటి లోపాలు ఉండవు. అంతేకాదు డబ్బు కూడా చేతిలోనే ఉంటుంది. కనుక ఇంటి ప్రధాన ద్వారం వద్ద సూర్య భగవానుడి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచవచ్చు. సూర్యభగవానుని అనుగ్రహం పొందితే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని పురాణాల కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)