Sorghum : జొన్నలలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..

గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత భారతదేశంలో ఎక్కువగా పండించే పంట జొన్నలు (Sorghum). చిరుధాన్యాల్లో జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్య జొన్నలను విరివిగా వాడుతున్నారు.

Sorghum : జొన్నలలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..
Sorghum
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2022 | 9:46 PM

గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత భారతదేశంలో ఎక్కువగా పండించే పంట జొన్నలు (Sorghum). చిరుధాన్యాల్లో జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిత్యం మన జీవక్రియలకు అవసరమైన శరీరఅభివృద్ధికి ఉపయోగపడే మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, ఫైబర్, ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి పోషకాలున్న జొన్న ధాన్యంలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. .

ఈ మధ్య జొన్నలను విరివిగా వాడుతున్నారు. పీచు పదార్థాలు అధికంగా ఉండే జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నలలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి.

జొన్నలను ఎక్కువగా తీసుకునే వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. జొన్నలు కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాయి. వీటిలో విటమిన్ బీ6 అధికంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన ఆహారపదార్థాలు పెట్టడం ఎంతో మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి