Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త – ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల
AP News: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను కూడా ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ..
AP Probation Declaration : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి ప్రొబేషన్ ఖరారు చేసేందుకు జీవోను విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ఎపి ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 5ను జారీ చేసింది.
సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను కూడా ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ.23,120 నుంచి రూ.74,770, ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ.22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సిఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి