నది ఒడ్డున శివయ్యకు బీరుతో అభిషేకం చేసిన ఇద్దరు యువకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హిందూ ధర్మంలో శివలింగంపై బిల్వ పత్రం, పూలు, నీరు, పాలు మొదలైన వాటిని సమర్పిస్తూ.. భక్తులు శివునికి అభిషేకం చేయడాన్ని మీరు చూసి ఉంటారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు శివలింగానికి బీరుతో అభిషేకం చేస్తున్నారు.

నది ఒడ్డున శివయ్యకు బీరుతో అభిషేకం చేసిన ఇద్దరు యువకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Viral News 1
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2022 | 8:26 PM

Viral news: వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. అంతేకాదు.. ఈ వీడియో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సనాతన హిందూ ధర్మంలో శివలింగంపై బిల్వ పత్రం, పూలు, నీరు, పాలు మొదలైన వాటిని సమర్పిస్తూ.. భక్తులు శివునికి అభిషేకం చేయడాన్ని మీరు చూసి ఉంటారు. అయితే వైరల్ అవుతున్న  వీడియోలో ఇద్దరు యువకులు శివలింగానికి బీరుతో అభిషేకం చేస్తున్నారు. ఇద్దరూ మత్తులో ఉన్నారు. నది ఒడ్డున కూర్చుని బీరు తాగుతూ.. వారు శివలింగంపై కూడా బీరు పోస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అంతేకాదు ఆ ఇద్దరు యువకులపై పోలీసు కేసు నమోదైంది.

నది ఒడ్డున ఉన్న శివలింగం వద్ద ఇద్దరు యువకులు బూట్లు వేసుకుని కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ యువకుల్లో ఒకరు నవ్వుతూ బీరు తాగుతుండగా, మరో యువకుడు శివలింగానికి బీరుతో అభిషేకం చేస్తూ కనిపిస్తున్నాడు.  అప్పుడు.. శివలింగాన్ని తాకి, నమస్కరించి, అతను లేచి నిలబడి కెమెరా వైపు నడుస్తున్నాడు. విశేషమేమిటంటే బ్యాక్ గ్రౌండ్ లో శివయ్య కు సంబంధించిన భక్తి సాంగ్  కూడా ప్లే అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చండీగఢ్ లోని అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, వారిలో ఒకరు చండీగఢ్‌లోని సెక్టార్ 26 నివాసి. మీడియా కథనాల ప్రకారం, బజరంగ్ దళ్ యువకుడిపై ఐటీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని భజరంగ్ దళ్ హెచ్చరించింది. మీడియా కథనాల ప్రకారం.. ఇది శివుడిని అవమానించడమేనని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త అరవింద్ సింగ్ అన్నారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..