Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్లపై కార్ సర్ఫింగ్‌ను ఇష్టపడే చిలుక.. లాంగ్‌ డ్రైవ్‌ ఎంజాయ్‌ చేస్తోన్న వీడియో వైరల్

రామ చిలుక‌లు చూడ‌డానికి భ‌లే ముద్దుగా ఉంటాయి. చక్కగా మాట్లాడతాయి.. ఈ మధ్య పాటలు కూడా పాడేస్తున్నాయి.. మ‌నుషుల‌తో ఇట్టే క‌లిసిపోతాయి. ఇదిలా ఉంటే ఇక్కడ ఓ చిలుక లాంగ్‌ డ్రైవ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది

Viral Video: రోడ్లపై కార్ సర్ఫింగ్‌ను ఇష్టపడే చిలుక.. లాంగ్‌ డ్రైవ్‌ ఎంజాయ్‌ చేస్తోన్న వీడియో వైరల్
Cockatoo Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2022 | 3:38 PM

Viral Video: జంతువులు, పక్షుల వీడియోలు పక్షుల ప్రేమికులను ఆకర్షిస్తాయి. కుక్కపిల్లలు ఆడుకోవడం, పిల్లి పిల్లలు తెలివితక్కువ పనులు చేయడం, ఏనుగులు ఎంజాయ్ చేస్తుండడం.. ఇలాంటి వీడియోలు చూడముచ్చటగా ఉంటాయి.  అందమైన వీడియోలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి.. కొన్ని నవ్విస్తాయి కూడా. తాజాగా ఇంటర్నెట్‌లో చిరునవ్వులు చిందిస్తున్న అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ముఖ్యంగా పక్షుల్లో పెంపుడు పక్షులుగా రామచిలుకలు ప్రముఖ ప్లేస్ లో నిలుస్తునాయి. ఈ రామ చిలుక‌లు చూడ‌డానికి భ‌లే ముద్దుగా ఉంటాయి. చక్కగా మాట్లాడతాయి.. ఈ మధ్య పాటలు కూడా పాడేస్తున్నాయి.. మ‌నుషుల‌తో ఇట్టే క‌లిసిపోతాయి. ఇదిలా ఉంటే ఇక్కడ ఓ చిలుక లాంగ్‌ డ్రైవ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ అద్భుతమైన వీడియో నెటిజ‌న్లను అమితంగా ఆక‌ట్టుకుంటుంది. ఒక చిలుక తెరచి ఉన్న కారు కిటికీపై కూర్చుని కారు ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. తెల్లని చిలుక కారు కిటికీ అంచున కూర్చొని దాని ఈకల ద్వారా వేగంగా వీస్తున్న గాలిని ఆస్వాదిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.

ఈ వీడియోను ‘క్యూటెస్ట్ బర్డ్’ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి ‘సూప‌ర్ హీరో’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో చిలుక తెరిచి ఉన్న కారు కిటికీపై కూర్చుని ప్రయాణిస్తుంది. ప్రకృతిని సహజంగా అలవోకగా ఆస్వాదించే ఆ పక్షి.. ఇలా కారుపై నిలుచుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. కొత్త అనుభూతిని పొందుతోంది.ఈ పక్షిని కోకో అని పిలుస్తారు. ఇది రోడ్లపై కార్ సర్ఫింగ్‌ను ఇష్టపడుతుంది. ఇది సిట్రాన్ కాకాటూ జాతికి చెందిన చిలుక‌. వీటికి కారు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు చిలుక ప్రయాణంపై రకరకాల కామెంట్ల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Cutest.bird (@cutest.bird)

ఈ అందమైన పక్షి సేఫ్టీ లీష్ అటాచ్‌తో రైడ్‌ను ఆస్వాదిస్తూ ఎంత దూరం వెళ్లాలో యజమానులకు తెలుసు..” అని మరొకరు వ్యాఖ్యానించారు.. చిలుక ఎగరాలనుకుంటుంది.. కానీ ఎగరలేకపోతుంది.. అందుకనే ఈ క్షణం చిలుక  ఎగురుతున్న అనుభూతిని కలిగి ఉంది అని ఒకరు..  ఇది ప్రమాద కరం అంటూ మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..