AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

300KGs Fish: నదిలో పట్టుబడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి స్టింగ్రే చేప.. దీని ప్రత్యేకతలు ఏంటో తెల్సా..?

ఈ భారీ స్టింగ్రే చేపకు 'బోరామి' అని పేరు పెట్టారు. బోరామి అంటే ఖైమర్ భాషలో "పూర్ణ చంద్రుడు" అని అర్థం. అనంతరం ఈ చేపకు ఎలక్ట్రానిక్ ట్యాగ్‌ను అమర్చి తిరిగి నదిలోకి వదిలిపెట్టారు.

300KGs Fish: నదిలో పట్టుబడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి  స్టింగ్రే చేప.. దీని ప్రత్యేకతలు ఏంటో తెల్సా..?
World Largest Freshwater Fi
Surya Kala
|

Updated on: Jun 21, 2022 | 5:27 PM

Share

300KGs Fish: ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేప కంబోడియాలోని మెకాంగ్ నదిలో పట్టుబడింది. ఇది అతిప్రమదకరమై ఈ మంచినీటి స్టింగ్రే చేప. బరువు  300 కిలోలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేప అని పరిశోధకులు చెబుతున్నారు. జూన్ 13న పట్టుకున్న ఈ చేప పొడవు 13 అడుగులు. దీన్ని స్థానిక మత్స్యకారుడు పట్టుకున్నాడు. ఈ చేప స్టంగ్ ట్రాంగ్ అనే ప్రదేశంలో మత్స్యకారుల వలలో చిక్కుకుంది. దీంతో సైజుని ఆకారాన్ని చూసి మత్స్యకారుడు చాలా ఆశ్చర్యపోయాడు.  అతను వెంటనే దాని గురించి శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చాడు.

రికార్డ్ సృష్టించిన  స్టింగ్రే చేప:  ఈ భారీ 4 మీటర్ల పొడవైన స్టింగ్రే చేపకు ‘బోరామి’ అని పేరు పెట్టారు. బోరామి అంటే  ఖైమర్ భాషలో “పూర్ణ చంద్రుడు” అని అర్థం. అనంతరం ఈ చేపకు ఎలక్ట్రానిక్ ట్యాగ్‌ను అమర్చి తిరిగి నదిలోకి వదిలిపెట్టారు. ఈ ట్యాగ్ ద్వారా పరిశోధకులు దీని కదలిక , ప్రవర్తనను పర్యవేక్షించగలరు. గతంలో 293 కిలోల బరువున్న క్యాట్ ఫిష్ పేరిట అతిపెద్ద మంచినీటి చేపగా గతంలో రికార్డు ఉంది. ఇది 2005లో థాయ్‌లాండ్‌లో పట్టుబడిందని శాస్త్రవేత్తల చెప్పారు. ఇప్పుడు ఈ  స్టింగ్రే చేప ఆ రికార్డ్ ను బీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

జీవశాస్త్రవేత్త ఏమి చెప్పారంటే: జీవశాస్త్రవేత్త జెబ్ హొగన్ మాట్లాడుతూ.. ఇది చాలా సంతోషకరమైన వార్త అని అన్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేప. ‘మాన్‌స్టర్ ఫిష్’ చేపలు .. ప్రస్తుతం నదుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. మెకాంగ్ నది చాలా శుభ్రంగా ఉంది. దీంతో ఈ  నదిలో ఇంకా చాలా పెద్ద చేపలు ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

శాస్త్రవేత్తల్లో నయా జోష్: మెకాంగ్ నది ప్రపంచంలో మూడవ అత్యంత వైవిధ్యమైన చేపలను కలిగి ఉంది. అయితే.. మితిమీరిన చేపల వేట, కాలుష్యం, ఉప్పునీరు చేరడం, అవక్షేపాలు లేకపోవడం వల్ల ఈ రకరకాల అరుదైన చేపల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని రివర్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అతిపెద్ద స్టింగ్రే చేపను కనుగొనడంతో పరిశోధనకు సరికొత్త జోష్ వచ్చిందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..