Mysterious Rock: ఈ ప్రకృతి వింత సైన్స్‌కు సవాల్… ప్రతి 30 ఏళ్లకు గుడ్లు పెట్టే రాయి.. ఈ గుడ్లు కోసం పోటీపడే ప్రజలు
కోడి, బాతు, పక్షులు, పాములు గుడ్లు పెట్టడం గురించి వినే ఉంటారు. కానీ చైనాకు చెందిన ఈ శిల గుడ్లు పెడుతుంది. అది కూడా ముప్పై ఏళ్లకు ఒకసారి.
Mysterious Rock: ప్రపంచంలో ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలున్నాయి. ఇలాంటి వింతలు ఏమిటి అంటే ఎవరి వద్ద సమాధానం లేదు. ప్రకృతి అనేక వింతలకు కారణమవుతుంది.. వాటికి చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ చర్యల వెనుక కారణం ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు కూడా చాలా సంవత్సరాలుగా సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వింతలకు గల కారణం ఇప్పటికీ కనుగొనలేవిని ఎన్నో ఉన్నాయి. ఈ రహస్యాలు కేవలం ఊహాగానాల ఆధారంగానే ఛేదించబడుతూ ఉంటాయి. అలాంటి రహస్యమైన శిల ఒకటి చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో ఉంది. ఈ రాయి ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి గుడ్లు పెడుతుంది.
అవును, మీరు సరిగ్గా చదివారు. ఈ రోజు వరకు మీరు కోడి, బాతు, పక్షులు, పాములు గుడ్లు పెట్టడం గురించి వినే ఉంటారు. కానీ చైనాకు చెందిన ఈ శిల గుడ్లు పెడుతుంది. అది కూడా ముప్పై ఏళ్లకు ఒకసారి. ఈ రాయి గుడ్డును ముప్పై సంవత్సరాల పాటు దాని లోపల ఉంచడం ద్వారా పొదుగుతుంది. దీని తరువాత, ముప్పై సంవత్సరాల వయస్సులో, గుడ్లు తమంతట తాముగా రాక్ నుండి బయటకు వస్తాయి. ఇవి మృదువైనవి. రాతి ఎత్తు 19 అడుగులు వెడల్పు 65 అడుగులు ఉంటుంది. గుడ్లు రాతి లోపల పుట్టి ముప్పై సంవత్సరాలలో వాటంతట అవే బయట పడతాయి. స్థానిక ప్రజలు ఈ రాళ్ల నుండి విడుదలయ్యే గుడ్లను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. అందుకనే ఈ గుడ్లు నేలపై పడగానే గ్రామస్తులు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్తారు.
నలుపు రంగు గుడ్లు: చైనాలోని ఈ రహస్యమైన శిలని ‘చాన్ డాన్ యా’ అని పిలుస్తారు. ఈ రాతి మొత్తం నలుపు రంగులో ఉంటుంది. దీంతో ఈ రాయి పెట్టే గుడ్డు కూడా నలుపు రంగులో ఉంటుంది. రాళ్ళు గుడ్డు ఆకారంలో ఉంటాయి. ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి రాళ్లు గుడ్లు పెట్టడం గురించి ఇప్పటికే శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేశారు.. ప్రపంచంలోని పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి .. రాళ్లు గుడ్లు పెట్టె ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎవరూ విజయం సాధించలేదు.
అతిపురాతనమైన శిల: భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ శిల 50,00,00,000 సంవత్సరాల పురాతనమైనది. ఈ గుడ్డు ఆకారపు రాళ్ళు రాయి లోపల.. ప్రత్యేక కవచంలో బంధించబడి ఉంటాయని చెబుతారు. ఈ కవచం పూర్తిగా తొలగించబడిన వెంటనే.. ఆ రాళ్లు తమంతట తామే నేలమీద పడిపోతాయని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ శిలలు కొన్నిసార్లు అధిక ఉష్ణోగ్రతలు, చల్లని వాతావరణాన్ని తట్టుకోవలసి ఉంటుంది. దీని కారణంగా రాతిలో కూర్పు, అంశాలలో మార్పులు చూడవచ్చు. ఈ కారణంగానే ఈ రాళ్లపై అనేక రకాల ఆకారాలు కనిపిస్తాయి. అయితే. ఈ రాతి పై గుడ్లు ఆకారంలో అదీ మృదువుగా ఎలా ఏర్పడతాయో ఇప్పటివరకూ శాస్త్రజ్ఞులు కనుగొనలేకపోయారు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..