AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1700 Crore Lottery: ఓ యువతిని వెంటాడిన దురదృష్టం.. కొన్ని రూపాయల కారణంగా 1700 కోట్ల విలువైన లాటరీ మిస్

ఓ మహిళకు విధి సాయం చేసి ఉంటే ఈరోజు రూ.1700 కోట్లు ఆమె సొంతమయ్యేవి. ఈరోజు కోట్ల రూపాయలకు అధిపతిగా మారేది.

1700 Crore Lottery: ఓ యువతిని వెంటాడిన దురదృష్టం.. కొన్ని రూపాయల కారణంగా 1700 కోట్ల విలువైన లాటరీ మిస్
Lottery
Surya Kala
|

Updated on: Jun 19, 2022 | 5:44 PM

Share

1700 Crore Lottery: మన జాతకం బాగుండి..  అదృష్టం చెంత ఉంటే .. చిన్న విషయాలు కూడా గొప్ప విజయాన్ని అందిస్తాయి. కూటికి లేని కటిక పేద కూడా క్షణ కాలంలో కోటీశ్వరుడు అవుతాడు. అదే విధి వక్రీకరించి.. గ్రహాలు అనుకూలంగా లేకుండా మనకు ఎదురు తిరిగితే..ఒంటరిగా కూర్చున్నా తాడే పామై కరచిపోతుంది. ఒక్కోసారి అంతా సవ్యంగా సాగిపోయినా.. లక్ లేకుంటే మన చేతిలో ఉన్న మంచి వస్తువులు కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటి ఒక ఘటన ఇప్పుడు బ్రిటన్‌లో ( Britain ) జరిగింది. ఓ మహిళకు విధి సాయం చేసి ఉంటే ఈరోజు రూ.1700 కోట్లు ఆమె సొంతమయ్యేవి. ఈరోజు కోట్ల రూపాయలకు అధిపతిగా మారేది.  19 ఏళ్ల రాచెల్ కెన్నెడీ దగ్గర కొంత డబ్బు ఉంటే.. ఓ  లాటరీ ద్వారా వేల కోట్లకు యజమానురాలు అయ్యేది.

బ్రిటన్‌లోని జరిగిన ఈ ఉదంతాన్ని ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం..  రాచెల్ కెన్నెడీ, ఆమె బాయ్‌ఫ్రెండ్ లియామ్ మెక్‌క్రోహన్‌తో కలిసి గత కొన్ని వారాలుగా యూరో మిలియన్ల కోసం టిక్కెట్లు కొనుగోలు చేస్తుంది.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ యువతి ఎప్పుడూ ఒకే నంబర్ లాటరీ టిక్కెట్‌ను ఎంచుకునేది. ఇలా చేయడం వలన ఏదో ఒకరోజు తనకు కచ్చితంగా లాటరీ తగులుతుందని ఆశించింది.

రూ. 1734 కోట్లకు పైగా లాటరీ రాచెల్, లియామ్ ఒకే సిరీస్ నంబర్‌లపై (6, 12, 22, 29, 33, 6 మరియు 11) కలిసి పందెం వేశారు. ఈసారి రాచెల్,  ఆమె భాగస్వామి కలిసి 182 మిలియన్ పౌండ్ల (రూ. 1734 కోట్లకు పైగా) లాటరీని గెలుచుకున్నారు. ఈ వార్త తెలియగానే రాచెల్ ఆనందంతో ఎగిరి గంతేసి తన భాగస్వామి లియామ్, తల్లితో కలిసి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం ప్రారంభించింది. మొదట..  రాచెల్ తను పందెం వేసే అదే నంబర్‌పై £182 మిలియన్ లాటరీని గెలుచుకున్నట్లు నమ్మలేదు. దీన్ని ధృవీకరించుకోవడానికి ఆమె EuroMillions ఆఫీస్ కు కాల్ చేసింది. అయితే రాచెల్ ఓ షాకింగ్ వార్తను వింది.

ఇవి కూడా చదవండి

నిజానికి, EuroMillions కార్యాలయంలోని వ్యక్తులు రాచెల్ లాటరీ నంబర్‌పై ఆడారని.. అయితే రాచెల్ ఆ బహుమతిని పొందలేకపోయిందని చెప్పారు. ఎందుకంటే రాచెల్ ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసే సమయంలో.. ఆమె ఖాతాలో 238 యూరోలు ఉన్నాయి. కానీ ఆ లాటరీ టికెట్ కొనుగోలుకు 240 యూరోలు కావాలి. రివార్డ్ పొందిన నంబర్ టిక్కెట్‌ను రాచెల్ కొనలేకపోయింది. అంత పెద్ద లాటరీ ఆమె చేతిలో నుండి జారిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది