Agnipath Protest : సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో కీలక సూత్రధారి అరెస్ట్‌.. వెలుగులోకి మరిన్ని సంచలనాలు

పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నోరు విప్పారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశారు. ఆందోళనకారులకు అనుచరుడు నరేష్ ..

Agnipath Protest : సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో కీలక సూత్రధారి అరెస్ట్‌.. వెలుగులోకి మరిన్ని సంచలనాలు
Subbarao
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2022 | 3:43 PM

Agnipath Protest : సికింద్రాబాద్ విధ్వంసం కేసు విషయంలో రైల్వే పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్‌ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం అతన్ని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌ర్వాత ఆయ‌న‌ను బోయిగూడ రైల్వే కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. మరోవైపు మేడిప‌ల్లిలోని సాయి డిఫెన్స్ అకాడ‌మీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నిర్వాహ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడ‌మీ రికార్డులతో పాటు అన్ని ప‌త్రాల‌ను ఆర్పీఎఫ్ కార్యాల‌యానికి తీసుకురావాల‌ని ఆదేశించారు. రైల్వే యాక్ట్ 1989 కింద నోటీసులు జారీ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే, పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నోరు విప్పారు. అనుచరులతో కలిసి సుబ్బారావు విధ్వంసానికి స్కెచ్ వేసినట్టు అంగీరించారని తెలుస్తోంది.. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో కలిసి ఆవుల సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టారు. ఆవుల సుబ్బారావు ఆదేశాలతో ఆందోళనలు చేయాలని గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశారు. ఆందోళనకారులకు అనుచరుడు నరేష్ ఆహారం అందించారు. సుబ్బారావు అనుచరుడు నరేష్ పరారీలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి