Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

91వ ఏట మళ్లి పెళ్లికి సిద్ధమైన మీడియా దిగ్గజం.. రూపర్ట్ మర్దోక్ నాలుగో పెళ్లి పెటాకులు..

బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జెర్రీ హాల్, రూపర్ట్ ముర్డోక్‌లకు వేర్వేరు వివాహాల ద్వారా 10 మంది పిల్లలు ఉన్నారు.

91వ ఏట మళ్లి పెళ్లికి సిద్ధమైన మీడియా దిగ్గజం.. రూపర్ట్ మర్దోక్ నాలుగో పెళ్లి పెటాకులు..
Media Baron
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 23, 2022 | 1:31 PM

బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 65 ఏళ్ల నటి జెర్రీ హాల్ తో మర్డోక్ విడాకులు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఆరేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు సమాచారం.

1956 ప్యాట్రిసియా బుకర్‌తో ముర్డోక్ మొదటి వివాహం జరిగింది. ఇది 1967లో ఆ పెళ్లి ముగిసింది. తర్వాత అతను అన్నా మారియా టోర్‌ను రెండవసారి వివాహం చేసుకున్నాడు, ఇది 1967 నుండి 1999 వరకు కొనసాగింది. వెండీ 1999లో డెంగ్‌ను మూడవసారి వివాహం చేసుకున్నాడు.. అది 2013 వరకు కొనసాగింది. 2016లో ‘బ్యాట్‌మాన్’, ‘ది గ్రాడ్యుయేట్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జెర్రీ హాల్‌ను మర్డోక్ వివాహం చేసుకున్నాడు.ఫాక్స్ న్యూస్ ఛానల్, న్యూస్ కార్ప్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవన్నీ మర్డోక్ కు చెందిన వార్తా సంస్థలు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ లో కుటుంబ ట్రస్ట్ ద్వారా మర్డోక్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ముర్డోక్ కంటే ముందు, జెర్రీ హాల్ గాయకుడు మిక్ జాగర్‌ను వివాహం చేసుకున్నాడు. జెర్రీ హాల్, రూపర్ట్ ముర్డోక్‌లకు వేర్వేరు వివాహాల నుండి 10 మంది పిల్లలు ఉన్నారు. మర్డోక్ తన నాల్గవ వివాహంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా, సంతోషంగా ఉన్న వ్యక్తిగా తాను కనిపిస్తున్నానని అప్పట్లో ఆయన ప్రకటించారు. విడాకుల కథనంపై ఇటు మర్డోక్ అధికార ప్రతినిధి కానీ, అటు 65 ఏళ్ల హాల్ ప్రతినిధి కానీ స్పందించలేదు. మర్డోక్, హాల్ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారే. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మర్డోక్ నెట్ వర్త్ 17.7 బిలియన్ డాలర్లు. సుమారు రూ.1.80 లక్షల కోట్లు.