Tinder: టిండర్‌లో పరిచయం అయిన యువతిపై అత్యాచారం.. యూకేలో భారత సంతతి వైద్యుడికి జైలు..
టిండర్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను లైంగిక వేధింపులకు, దాడికి గురి చేసిన భారత సంతతికి చెందిన ఓ డాక్టర్‌కు యూకే కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో డాక్టర్ మనేశ్ గిల్‌ను దోషిగా నిర్ధారించిన
టిండర్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను లైంగిక వేధింపులకు, దాడికి గురి చేసిన భారత సంతతికి చెందిన ఓ డాక్టర్‌కు యూకే కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో డాక్టర్ మనేశ్ గిల్‌ను దోషిగా నిర్ధారించిన స్కాటిష్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. టిండర్ యాప్‌లో మైక్ అనే పేరుతో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు గిల్. ఈ క్రమంలో డిసెంబరు 2018లో స్టెర్లింగ్‌లోని ఒక హోటల్‌లో మీట్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. కానీ పథకం ప్రకారం ముందుగానే రూం బుక్ చేసుకున్న గిల్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ఎడిన్‌బర్గ్‌లోని హైకోర్టు నేరస్తుడిగా నిర్ధారించింది. దీంతో అతనికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తాజాగా కోర్టు తీర్పు చెప్పింది. అలాగే గిల్ పేరును లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో కూడా చేర్చింది. ‘‘తన విపరీత ప్రవర్తనకు గిల్ శిక్ష ఎదుర్కొంటున్నాడు. గిల్‌కు శిక్ష పడటం లైంగిక నేరాలకు పాల్పడేవారికి చెంపపెట్టు లాంటి” దని స్కాట్‌లాండ్ పబ్లిక్ ప్రొటెక్షన్ యూనిట్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు తెలిపారు. మరోవైపు ఈ కేసు విచారణలో బాధిత మహిళ తాను నర్సింగ్ విద్యార్థినని వెల్లడించింది. ఈ వేధింపుల పర్వంతో తాను అనుభవించిన మానసిక వేదనను విచారణ అధికారుల ముందు వివరించింది. కాగా పరస్పర అంగీకారంతోనే జరిగిందని, తాను లైంగిక దాడి చేయలేదని గిల్ వాదించాడు. అయినా కోర్టు బాధితురాలి వాదనను సమర్థించింది. మనేశ్ గిల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

