AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Economic Crises: పాకిస్థాన్‌లో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం.. చైనా నుంచి కొత్తగా 2.3 బిలియన్‌ డాలర్ల అప్పు తీసుకున్న దాయాది దేశం..

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. మరోవైపు చైనాతో 2.3 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై పాకిస్థాన్ సంతకం చేసింది. చైనా బ్యాంకుల కన్సార్టియంతో పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది...

Pakistan Economic Crises: పాకిస్థాన్‌లో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం.. చైనా నుంచి కొత్తగా 2.3 బిలియన్‌ డాలర్ల అప్పు తీసుకున్న దాయాది దేశం..
Pakistan
Srinivas Chekkilla
|

Updated on: Jun 23, 2022 | 1:00 PM

Share

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. మరోవైపు చైనాతో 2.3 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై పాకిస్థాన్ సంతకం చేసింది. చైనా బ్యాంకుల కన్సార్టియంతో పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశంలో విదేశీ నిల్వలు తగ్గుముఖం పట్టడంతో పాటు కరెన్సీలో కూడా భారీ క్షీణత కనిపిస్తోంది. నగదు కొరతతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఈ రుణం ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశం ముఖ్యమైన దిగుమతుల కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ట్విటర్ పోస్ట్‌లో ఈ డబ్బును కొద్ది రోజుల్లో అందుకోవచ్చని భావిస్తున్నామని రాశారు. లావాదేవీని సులభతరం చేసినందుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇస్మాయిల్, చైనా బ్యాంకుల కన్సార్టియం బుధవారం $ 2.3 బిలియన్ల రుణ సదుపాయ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు మంగళవారం పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు రుణ ఒప్పందం కొంత ఊరటనిచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ కరెన్సీ 34 శాతం క్షీణించింది. సోమవారం ఒక డాలర్ మారకం విలువ 210 పాకిస్థానీ రూపాయలు. ఇది కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌లో ఉంచిన ఫారెక్స్ రిజర్వ్ జూన్ 10 నాటికి 9 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. రిజర్వ్ చాలా వారాల పాటు దిగుమతి కవర్ స్థాయి కంటే తక్కువగా ఉంది. డాన్ వార్తాపత్రిక ప్రకారం పాకిస్తాన్‌కు ప్రస్తుతం తన రుణం, ఇతర వాటిని చెల్లించడానికి కనీసం $ 37 బిలియన్లు అవసరం. అయితే ఈ ఒప్పందం వల్ల చైనా నుంచి పదే పదే రుణాలు తీసుకునే పాక్ అలవాటు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం, పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందిస్తున్న అతిపెద్ద దేశంగా చైనా నిలిచింది. చైనా ప్రస్తుతం పాకిస్థాన్‌కు 14.5 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది.