Pakistan: పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ ప్లాన్స్ చౌకగా దొరుకుతాయా? అక్కడ 5GB డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?

మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామంది తమకిష్టమైన వాటిని ఇంటి దగ్గర నుంచే..

Pakistan: పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ ప్లాన్స్ చౌకగా దొరుకుతాయా? అక్కడ 5GB డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
Pakistan Internet Packs
Follow us

|

Updated on: Jun 23, 2022 | 12:08 PM

పాకిస్తాన్.. పేరుకు ఆ దేశం మన శత్రు దేశమే అయినా.. అక్కడుందే వాటి గురించి పెద్దగా మనకు తెలియదు. ఉగ్రవాదానికి మారుపేరుగా నిలిచే పాకిస్తాన్‌లో టెక్నాలజీ స్థితిగతులు ఏంటి.? అక్కడ డేటా ప్లాన్స్ ఖరీదైనవా.? లేక చౌకగా దొరుకుతాయా.? పాకిస్తాన్‌లో దొరికే ఇంటర్నెట్ ప్లాన్స్‌తో పోలిస్తే.. మన దేశంలో ఇంటర్నెట్ ప్లాన్ ధర ఎంత ఉంటుంది.? లాంటి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామంది తమకిష్టమైన వాటిని ఇంటి దగ్గర నుంచే మొబైల్ ద్వారా ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఫుడ్ నుంచి ఫర్నిచర్ వరకు.. ల్యాప్‌టాప్స్ నుంచి మొబైల్ చార్జర్స్ వరకు అన్ని ఇంటికే జస్ట్ వన్ క్లిక్‌తో పొందుతున్నారు. అలాగే ఇటీవల ఆన్‌లైన్ లావాదేవీలు కూడా బాగా పెరిగిపోయాయి. దేశంలో ఓ యూజర్ నెలకు 12 జీబీ ఇంటర్నెట్ ఉపయోగిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. దీనితో ఇండియాలోని సర్వీస్ ప్రొవైడర్స్ జనాలను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలకే ఇంటర్నెట్ ప్లాన్స్ అందిస్తున్నాయి. భారత్‌లో 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ ప్లాన్ సుమారు రూ. 800కు అందుబాటులో ఉండగా.. పాకిస్థాన్‌లో ఇదే ప్లాన్‌కు రూ. 1550 చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ చాలా కాస్ట్లీ.

ఇవి కూడా చదవండి

అక్కడ ఓ టెలికాం కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాన్స్ ఒక్కసారి చెక్ చేస్తే.. 10GB ఇంటర్నెట్, 250 మినిట్స్ కాలింగ్ ప్యాక్ 699 పాకిస్తానీ రూపాయలు కాగా.. ఈ ప్లాన్ నెల వ్యాలిడిటీతో దొరుకుతోంది. ఇక 399 పాకిస్తాన్ రూపాయల వీక్లీ ప్లాన్‌లో 40 GB ఇంటర్నెట్, 250 మినిట్స్ కాలింగ్ అందుబాటులో ఉంది. అలాగే ఓన్లీ ఇంటర్నెట్ ప్లాన్స్ ఒక్కసారి పరిశీలిస్తే.. 5 GB ఇంటర్నెట్‌ 330 పాకిస్తానీ రూపాయలు కాగా, 3 GB ఇంటర్నెట్‌ 160 పాకిస్తానీ రూపాయలు. అదే సమయంలో, మూడు రోజుల ఇంటర్నెట్ ప్లాన్ కోసం 1.5 GB ఇంటర్నెట్‌కు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.