AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. స్వయంగా రాష్ట్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక నిధులు విడుదల చేస్తామని గతంలో రేవంత్ ప్రకటించారు.

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Mar 12, 2026 | 6:21 PM

Share

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ చేయట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలో తొలి విడతగా రూ.4,500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని రైతులు వీటి కోసం ఎప్పటినుంచో విడుదల చేస్తున్నారు. యాసంగి సీజన్ స్టార్ట్ అయినా ఇంకా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెలాఖరు నుంచి మొదలుకానున్న ప్రక్రియ

గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగా ఈ నెలాఖరు నుంచే రైతు భరోసా నిధులను విడుదల చేసే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రెండు విడతలుగా రైతు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. తొలుత రూ.4,500 కోట్లు, ఆ తర్వాత రూ.4,500 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేసారి లబ్దిదారులందరికీ నిధులు విడుదల చేయడం లేదు. రోజుకి కొంతమంది చెప్పున డబ్బులు విడుదల చేస్తోంది. ఈ సారి కూడా అదే విధానాన్ని పాటించనుంది.

రైతులకు బోనస్ అందజేత

ఇక సన్న బియ్యం పండించే రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు బోనస్ సొమ్ము అందిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ఇప్పటివరకు 92 శాతం మంది రైతులకు వాటిని అందించామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాలు సరిగ్గా పనిచేసేలా మార్కెట్ కమిటీలు చూడాలన్నారు. ఇక రాష్ట్రంలోని పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రక్రియను సలభతరం చేశామని, ఇక నుంచి ఆ ప్రాసెస్ నిరంతరం కానసాగుతూనే ఉంటుందన్నారు. కాగా జనవరిలోనే రైతు భరోసా వేయాల్సి ఉండగా.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతులకు ఇస్తామని ప్రచారంలో సీఎం రేవంత్ ప్రకటించారు. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

Follow Us