AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GVL: లక్ష్మణరేఖ దాటొద్దు.. ఆర్జీవీని హెచ్చరించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు..

GVL on RGV: లక్ష్మణరేఖ దాటొద్దని ఆర్జీవీని హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చౌకబారు విమర్శలు తగవన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సూచించారు. 

GVL: లక్ష్మణరేఖ దాటొద్దు.. ఆర్జీవీని హెచ్చరించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు..
Bjp Mp Gvl Narasimha Rao
Sanjay Kasula
|

Updated on: Jun 24, 2022 | 4:54 PM

Share

కాంట్రవర్సీకి మరో పేరుగా నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) కామెంట్స్‌పై హీట్‌ పెరుగుతూనే ఉంది. మరోసారి అనుచిత కామెంట్స్‌ చేశారు. ఈసారి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటూ ఆయన అభ్యంతరకరమైన ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆర్జీవీ చేసిన కాంమెట్స్‌పై ఇప్పటికే బీజేపీ నాయకులు అగ్గిమీద గుగ్గలం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) మాట్లాడారు. లక్ష్మణరేఖ దాటొద్దని ఆర్జీవీని హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చౌకబారు విమర్శలు తగవన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సూచించారు.

తాము అనుకున్నట్టుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరగలేదని దేశాన్ని విడగొట్టాలని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలుగు వ్యక్తి రాష్ట్రపతి అయితే సంతోషమే.. కానీ ద్రౌపది ముర్ము ఎంపిక విషయంలో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోందని ఆయన గుర్తు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పలు రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయన్నారు. ఈరోజు నామినేషన్ సందర్భంగా కనిపించిన మద్ధతుతో మా అభ్యర్థి సునాయాసంగా గెలుపొందుతారు అని తెలిసిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక RGV ట్వీట్‌పై బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, నందీశ్వర్‌ గౌడ్‌ అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మరోవైపు వర్మ ఒక వేస్ట్‌ ఫెలో అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. తాము ఫిర్యాదుపై పోలీసులు కచ్చితంగా చర్య తీసుకుంటారని అన్నారు.

ఆర్జీవీ మరో ట్వీట్..

మరో వైపు తాను చేసిన ట్వీట్‌ తీవ్రస్థాయిలో వివాదం కావడంతో నాలిక కరుచుకున్న వర్మ మరో ట్వీట్‌తో వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. తనకు ఎటువంటి దురుద్దేశం లేదని, మహాభారతదంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని మరో ట్వీట్‌ చేశారు. ద్రౌపది అనే పేరు చాలా అరుదుగా ఉంటుందని, ఆ పేరు వినగానే ఆ పేరుతో ముడిపడిన ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎవరి సెంటిమెంట్‌ గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు.

ఏపీ వార్తల కోసం..