Weight Loss: ఈ ఒక్క విటమిన్ లోపం వల్ల బరువు వేగంగా పెరుగుతారు..ఎలా సరి చేసుకోవాలో తెలుసా..

వ్యాయామం చేసే కొందరు వ్యక్తులు కూడా ఇలాంటి సమస్యన ఎదుర్కొంటున్నారు. కానీ వారి బరువు ఇప్పటికీ తగ్గలేకపోతున్నారు. అయితే ఇందుకు కారణం కూడా ఒకటి ఉంది. అదే..

Weight Loss:  ఈ ఒక్క విటమిన్ లోపం వల్ల బరువు వేగంగా పెరుగుతారు..ఎలా సరి చేసుకోవాలో తెలుసా..
B12 Deficiency Can Promote
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 24, 2022 | 4:25 PM

బరువు పెరగడం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికి ఉండే కామన్ సమస్య. బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం, బరువు తగ్గించే మందులు, డైటింగ్ చేసినా కొన్నిసార్లు బరువు తగ్గడం లేరు. ఆహారం పరిమితంగా తీసుకోవడం, క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేసే కొందరు వ్యక్తులు కూడా ఇలాంటి సమస్యన ఎదుర్కొంటున్నారు. కానీ వారి బరువు ఇప్పటికీ తగ్గలేకపోతున్నారు. అయితే ఇందుకు కారణం కూడా ఒకటి ఉంది. అదే శరీరానికి అవసరమైన విటమిన్ బి 12 లేకపోవడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంటారు.

శరీరానికి విటమిన్ B12 ప్రాముఖ్యత: విటమిన్ B12 అనేది నీటిలో కరిగే విటమిన్. ఈ విటమిన్ మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం. శరీరానికి అవసరమైన ఈ విటమిన్ రక్త కణాలను, శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

విటమిన్ B12 లోపం.. లక్షణాలు: శరీరంలో దాని లోపం కారణంగా, నాడీ రుగ్మత, క్రానిక్ ఫెటీగ్, శ్వాస ఆడకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, రక్తహీనత, శరీరంలో శక్తి లేకపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. మీరు కూడా బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. ముందుగా ఈ విటమిన్ లోపాన్ని పరీక్షించుకోండి. విటమిన్ B12 బరువు పెరగడానికి ఎలా కారణమవుతుందో.. దాని లోపాన్ని ఎలా భర్తీ చేయాలో కూడా తెలుసుకోండి. ఆ వివరాలను మీకోసం..

ఇవి కూడా చదవండి

విటమిన్ B12 లోపం బరువును ఎలా పెంచుతుంది: శరీరానికి అవసరమైన ఈ విటమిన్ B12 లోపం కారణంగా, శక్తి స్థాయి తగ్గుతుంది. జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఈ విటమిన్ ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియకు అవసరం. ఇది మన బరువును ప్రభావితం చేస్తుంది.

విటమిన్ B12 ఎలా పొందాలి?: శరీరంలో విటమిన్ B12 పొందడానికి ఉత్తమమైన, సహజమైన మార్గం ఈ విటమిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. విటమిన్ B12 లోపాన్ని తీర్చడానికి, మీరు మాంసం, చికెన్, సీఫుడ్, గుడ్లు, పాల ఉత్పత్తులు , తృణధాన్యాలు తీసుకోవాలి. ఈ సహజ వనరులే కాకుండా, మీరు విటమిన్ B12 క్యాప్సూల్స్, సిరప్‌లు, ఆరోగ్య పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఈ సప్లిమెంట్లన్నీవిటమిన్ బి12 స్థాయిలను సాధారణీకరించడంలో సహాయపడతాయి. ఏదైనా సప్లిమెంట్ లేదా ఔషధం తీసుకునే ముందు.. మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం