Diabetes Control: హెర్బల్ టీతో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.. ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి..
ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ హెర్బల్ టీ తాగి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది.
Diabetes Control Tips: ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు మొదట టీని తాగడాన్ని మానేయాలని సూచిస్తున్నారు వైద్యులు. పాలు, చక్కెరతో తాయారు చేసిన టీ తాగొద్దంటూ సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో డయాబెటిస్ బాధితులు మిల్క్ లేకుండా హెర్బల్ టీ (herbal tea) ని తాగవచ్చు. ఉదయం, సాయంత్రం ఈ హెర్బల్ టీ తాగి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితులు ఇంట్లో తయారుచేసిన హెర్బల్ టీని తాగడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. వంటింట్లో ఉన్న జీలకర్ర, మెంతులు, సోంపు వంటి సుగంధ ద్రవ్యాల నుంచి ఈ హెర్బల్ టీని తయారు చేసుకోవచ్చు. హెర్బల్ టీతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు. దీన్ని తాగడం వల్ల టీ తాగాలనే కోరికను నియంత్రించడంతోపాటు ప్రయోజనాలు పొందవచ్చు.
హెర్బల్ టీ కోసం కావలసిన పదార్థాలు..
ఇంట్లోనే హెర్బల్ టీని తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక స్పూన్ చొప్పున మెంతులు, సోంపు, జీలకర్ర, సగం నిమ్మకాయ, కొద్దిగా తేనె తీసుకోండి.
హెర్బల్ టీని ఇలా తయారు చేసుకోండి..
హెర్బల్ టీ తయారు చేయడానికి 1 గ్లాసు నీరు తీసుకోవాలి. ముందుగా మెంతులు, సొంపు, వాము, జీలకర్ర, నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. పదార్థాలన్నింటిని నీటిలో వేసి మరిగించి ఫిల్టర్ చేయాలి. దానికి నిమ్మరసం లేదా తేనె కలపండి. వేడి టీలాగా తాగండి. ఈ టీని ఉడకబెట్టకుండా కూడా ఫిల్టర్ చేసి తాగవచ్చు. హెర్బల్ టీ డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
హెర్బల్ టీ ప్రయోజనాలు
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఈ టీలో మెంతి గింజలను ఉపయోగిస్తారు. ఇది ఇన్సులిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. సోంపు, వాము, జీరా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. హెర్బల్ టీ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..