Diabetes: షుగర్ బాధితులకు టమాటలు అద్భుతమైన ఔషదం.. వీటిని ఎలా తినాలో తెలుసా..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jun 22, 2022 | 9:51 PM

Diabetic Food: టమాటలో ఉండే పోషకాలు మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం అనేది జీవక్రియ రుగ్మత..

Diabetes: షుగర్ బాధితులకు టమాటలు అద్భుతమైన ఔషదం.. వీటిని ఎలా తినాలో తెలుసా..
Tomatoes

Follow us on

టమాటలను భారతీయ వంటకాల్లో దాదాపు అన్నింటిలోనూ ఉపయోగిస్తారు. అయితే టమాటలో ఉండే పోషకాలు మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం అనేది జీవక్రియ రుగ్మత, ఇది అనారోగ్య జీవనశైలి, జన్యుపరమైన కారకాల కారణంగా చాాలా మందిని బాధితులుగా మార్చుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన సమతుల్య ఆహారం, వ్యాయామం, నిద్రతో మధుమేహాన్ని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయవచ్చు. టమాటలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిని సహజ పద్ధతిలో నిర్వహించడంలో సహాయపడుతుంది.

టమాటల్లో విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది కణాలను రిపేర్ చేయడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

టమోటా షుగర్ స్థాయిని నియంత్రిస్తుందా?

ఇవి కూడా చదవండి

టమాటలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే పదే పదే ఆకలి అనిపించదు. ఇది కోరికలను నియంత్రిస్తుంది. రక్తప్రవాహంలో చక్కెరను నిరంతరంగా విడుదల చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు శుద్ధి చేసిన పిండి పదార్థాలు తినడం నిషేధించారు వైద్యులు. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా చక్కెర స్థాయిని పెంచుతుంది. మరోవైపు, టమాట పిండి పదార్ధం లేనిది. కాబట్టి డయాబెటిక్ రోగులు తినడం మంచిదని భావిస్తారు. టమాటలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

టమోటాల మీ ఆహారంలో టమోటాలు ఎలా చేర్చుకోవాలి?

టమాటలను ఫ్రై చేయడం వల్ల దాని పోషక విలువలు కూడా తగ్గుతాయి. అందుకే కొన్నిసార్లు పచ్చివి తినడం చాలా ఉత్తమం. సలాడ్‌లు, జ్యూస్‌లు, స్మూతీస్, కోల్డ్ సూప్‌లు, శాండ్‌విచ్‌లలో టమోటాలు తినండి. ఈ విధంగా ఆహారం మీకు మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. టమాట సాస్ చేయడానికి, ఒక పెద్ద టమోటా, కప్పు తురిమిన క్యారెట్, కొత్తిమీర ఆకులు, అంగుళం అల్లం, 2 టీస్పూన్ల నిమ్మరసం తీసుకోండి. దీన్ని మిక్సీ చేయండి. ఇందలో కొద్దిగా ఉప్పు, కారం వేసి తాగాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu