AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వర్షాకాలంలో వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే రోజూ ఇలా చేయండి..

వర్షాకాలం మండుటెండల నుంచి ఉపశమనం కలిగించినా.. ఈ కాలంలో సీజనల్ ఫ్లూ, జ్వరమే కాకుండా ఇతర వ్యాధుల వ్యాప్తి ప్రమాదం పొంచి ఉంటుంది. తొలకరి జల్లులతోపాటు బోలెడన్ని..

Health Tips: వర్షాకాలంలో వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే రోజూ ఇలా చేయండి..
Monsoon Diet
Srilakshmi C
|

Updated on: Jun 22, 2022 | 10:04 AM

Share

Monsoon Diseases: వర్షాకాలం మండుటెండల నుంచి ఉపశమనం కలిగించినా.. ఈ కాలంలో సీజనల్ ఫ్లూ, జ్వరమే కాకుండా ఇతర వ్యాధుల వ్యాప్తి ప్రమాదం పొంచి ఉంటుంది. తొలకరి జల్లులతోపాటు బోలెడన్ని ఆరోగ్య సమస్యలు తెస్తాయి. ఐతే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలే పాటిస్తే ఈ సీజన్‌లో అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. ఈకాలంలో తెలిసో, తెలియకో తీసుకునే ఆహార అలవాట్ల వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. వానాకాలంలో తినవల్సిన హెల్తీ ఈటింగ్ టిప్స్ గురించి మీకోసం..

సీఫుడ్‌కి దూరంగా ఉండాలి.. చాలా మందికి చేపలు, రొయ్యలు, పీతల వంటి సీఫుడ్ ఇష్టంగా తినటం అలవాటు. ఐతే వానాకాలంలో సీఫుడ్ తినడం అంత మంచిదికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుచేత చేపలు లేదా ఇతర జీవులు సులభంగా వ్యాధి బారిన పడతాయి. కాబట్టి వర్షాకాలంలో సీఫుడ్ తినడం మానుకోవాలి.

పచ్చి ఆహారం తినకూడదు.. ఈ సీజన్‌లో పచ్చి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వండకుండా తినే ఆహారాలపై హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. దీని వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ సీజన్లో శరీర మెటబాలిజం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పచ్చి కూరగాయలు వంటి ఇతర ఆహారాలు తినకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

స్ట్రీట్‌ఫుడ్‌ అస్సలు తినకూడదు.. స్ట్రీట్‌ఫుడ్‌ని ఇష్టపడని వారు ఎవరుంటారు? ఐతే వర్షాకాలంలో మాత్రం స్ట్రీట్ ఫుడ్‌కు కొంత దూరంగా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్ తయారు చేసేటప్పుడు పరిశుభ్రత విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోరనే విషయం అందరికీ తెలిసిందే. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది. అందుచేత వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి లేదా బయటి ఆహారం తక్కువగా తీసుకోవాలి.

ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా కడగాలి ఏ సీజన్లోనైనా ఆహారాన్ని కడిగిన తర్వాత మాత్రమే తినటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో.. బ్యాక్టీరియా తరచుగా కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా ఆకు కూరల్లో ఎక్కువగా నివసం ఉంటాయి. అందుకే ఆహారాన్ని తినడానికి ముందు సరిగ్గా కడగడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి.

చల్లని, పుల్లని ఆహారాలు తినడం మానుకోవాలి ఈ సీజన్‌లో గొంతు ఇన్ఫెక్షన్ చాలా వేగంగా తలెత్తుతుంది. కాబట్టి ఐస్ క్రీం, జ్యూస్, పుల్లని ఆహార పదార్థాలను నివారించాలి.