Assam Tea: అరుదైన బంగారం రంగులో తేయాకు.. ఈ ‘టీ’పొడి కేవలం కిలో లక్ష రూపాయలు మాత్రమే..

టీ ఆకులను కిలో 500-1000 రూపాయలకు కొంటారు.. అయితే టీ ఆకుల ధర కిలోకు లక్షల రూపాయలు ఉంటుందని మీకు తెలుసా? అవును.. కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఖచ్చితంగా నిజం.

Assam Tea: అరుదైన బంగారం రంగులో తేయాకు.. ఈ 'టీ'పొడి కేవలం కిలో లక్ష రూపాయలు మాత్రమే..
Assam Tea Pabhojan Gold
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2022 | 4:45 PM

Assam Tea: భారతదేశాన్ని బ్రిటిష్ వారు వదిలి పెట్టి వెళ్లినా.. వారు చేసిన టీ అలవాటు మాత్రం మరింత ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు టీ కి సరికొత్త రుచులను ఇచ్చి..బ్లాక్, గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ, ఇలా అనేక రుచులతో బహుప్రాచుర్యం పొందింది. మన దేశంలో టీ తాగని వారు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు. దేశంలో అత్యధికంగా వినియోగించే పానీయం. ధనవంతులైనా, పేదవారైనా అందరూ టీ తాగుతారు. అవును, ధనవంతులు కొంచెం ఖరీదైన టీ ఆకులతో టీ తాగుతారు.. పేదలు తమకు ఏది దొరికితే అక్కడ టీ తాగుతారు. సాధారణంగా టీ ఆకులను కిలో 500-1000 రూపాయలకు కొంటారు.. అయితే టీ ఆకుల ధర కిలోకు లక్షల రూపాయలు ఉంటుందని మీకు తెలుసా? అవును.. కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఖచ్చితంగా నిజం. అస్సాంలోని అరుదైన జాతి పభోజన్ గోల్డ్ టీ కిలో లక్ష రూపాయలకు అమ్ముడైంది. జోర్హాట్‌లోని వేలం కేంద్రంలో సోమవారం ఈ తేయాకు విక్రయం జరిగింది.ఆ కిలో తేయాకు అక్షరాల రూ. 1 లక్షకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. పభోజన్ గోల్డ్ తేయాకు.. ఆర్గానిన్ తేయాకు. అత్యంత అరుదైన రకం. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో దీన్ని మొదటిసారి ఒక కిలో మాత్రమే పండించారు.

జోర్హాట్ టీ వేలం కేంద్రం (JTAC) అధికారి మాట్లాడుతూ.. ఈ ఖరీదైన టీ ఆకును పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ విక్రయించిందని.. అస్సాంకు చెందిన టీ బ్రాండ్ ‘ఎసాహ్ టీ’ కొనుగోలు చేసిందని చెప్పారు. అస్సాంలోని అత్యుత్తమ టీ రకాల్లో ఇదొకటి అని ఎస్సా టీ సీఈఓ బిజిత్ శర్మ తెలిపారు.

ఈ టీ చాలా రుచిగా ఉంటుంది పభోజన్  గోల్డ్ టీ చాలా రుచిగా ఉంటుంది. మెరిసేదని చెబుతారు. ఇది టీ తోటల నుండి రెండవ బ్యాచ్ టీ ఎంచుకున్న పై ఆకులను తీసి తయారు చేస్తారు. ఈ తేయాకుని కోసిన తర్వాత సహజసిద్ధంగానే బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఈ టీ పొడితో తయారయ్యే టీ.. పసుపు రంగులో ప్రశాశవంతంగా ఉంటుంది. ఇది టీకి మంచి రుచిని కూడా అందిస్తుంది. ఇది చాలా అరుదైన టీ కాబట్టి.. ఒక్క కప్పు టీ తాగడం వల్ల ప్రజలకు చాలా ప్రత్యేకమైన, విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..