Maharashtra Covid-19: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీలకు కరోనా పాజిటివ్‌..

Maharashtra Covid-19: ఒక వైపు మహష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గత రెండేళ్లకుపైగా..

Maharashtra Covid-19: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీలకు కరోనా పాజిటివ్‌..
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2022 | 4:22 PM

Maharashtra Covid-19: ఒక వైపు మహష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గత రెండేళ్లకుపైగా ప్రపంచాన్ని వణికించిన కోవిడ్‌.. ఇప్పుడు మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌,ఇతర ఆంక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా పాజిటివ్‌ కేసులు భారీ మొత్తంలో తగ్గుముఖం పట్టాయి. దేశంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కేసులు అదుపులో ఉండగా, మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు ఉన్న మంత్రులు, అధికారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనతో పాటు ఉన్నా, తనను కలిసిన వారు ఎవరైనా ఉంటే పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు ముఖ్యమంత్రి ఠాక్రే.

ఇవి కూడా చదవండి

గవర్నర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌: అలాగే మహారాష్ర్ట గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ కూడా కరోనా పాజిటివ్ తేలింది. బుధవారం దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు అధికారి తెలిపారు. బహిరంగ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించే కోష్యారీ (80) కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరినట్లు అధికారి తెలిపారు. ఆయనకు స్వల్ప కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఒక వైపు మహారాష్ట్ర సర్కార్ సంక్షోభంలో చిక్కుకోవడంతో తీవ్ర సంచలనంగా మారగా, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీలకు కరోనా సోకడంతో మరింత ఆందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే