Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే ఛాన్స్.. సంజయ్ రౌత్ సంచలన ట్వీట్..

తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ షిండే అంటున్నారు. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా తనకు మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని ఆయన పేర్కొన్నారు.

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే ఛాన్స్.. సంజయ్ రౌత్ సంచలన ట్వీట్..
Maharashtra Political Crisis
Follow us
Venkata Chari

|

Updated on: Jun 22, 2022 | 1:14 PM

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయంలో నిమిషానికో ట్విస్ట్‌ వస్తోంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పంపిన సంకేతాలు కీలకంగా మారాయి. అవసరమైతే ప్రభుత్వ రద్దు పరిశీలిస్తామని ఆయన సంకేతాలు పంపారు. బలంలేకపోతే అసెంబ్లీ రద్దు చేస్తామని సంజయ రౌత్‌ ట్వీట్‌ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇవే సిగ్నల్స్‌ ఇచ్చారు. ఏక్‌నాథ్‌ షిండేతో చర్చలు జరుగుతున్నాయని శివసేన నేతలు చెబుతున్నారు. ఇవాళ ఉదయం కూడా గంటపాటు షిండేతో మాట్లాడినట్లు శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ చెప్పారు. 40 ఏళ్ల నుంచి షిండే తనకు మిత్రుడని.. శివసైనికుడైన షిండే శివసేనలోనే ఉంటారని చెప్పుకొచ్చారు.

ఉద్దవ్‌ థాక్రే సర్కార్‌పై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండే వర్గం సూరత్‌ నుంచి గౌహతి చేరుకుంది. సూరత్‌ నుంచి చార్టెట్‌ ప్లైట్‌లో గౌహతి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి వారిని ప్రైవేటు హోటల్‌కు తరలించారు. విమానంతో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? అనే వివరాలు బయటకు రాలేదు. మూడు బస్సుల్లో ఎమ్మెల్యేలను తరలించారు.

తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ షిండే అంటున్నారు. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా తనకు మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని ఆయన పేర్కొన్నారు. షిండేతో పాటు 33 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజా రాజకీయ పరిణామాలతో సీఎం ఉద్దవ్‌ థాక్రే అత్యవసర కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేశారు. మంత్రులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అటు కాంగ్రెస్‌, ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలతో వేర్వేరు సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు శరద్‌పవార్‌ కూడా వరుసగా నేతలతో సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 26 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఆదిత్య ఠాక్రే ట్విట్టర్‌లో మంత్రి పేరును తొలగించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయం మరింత హీట్ ఎక్కింది.