Draupadi Murmu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి సింప్లిసిటీ చూశారా.. స్వయంగా చీపురు పట్టి. వైరల్ అవుతోన్న వీడియో..
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మరోసారి తన సింప్లిసిటీని...
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మరోసారి తన సింప్లిసిటీని చూపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం ఒడిషాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్లారు. అనంతరం ఆమె.. చీపురు చేతపట్టి స్వయంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె.. ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ద్రౌపది ముర్ముకు కేంద్రం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఆమెకు సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. ఇక, దేశానికి కాబోయే భారత రాష్ట్రపతి కోసం బీజేపీ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు.
అంతేకాదు అపారమైన పరిపాలనపరమైన అనుభవం ద్రౌపది ముర్ము సొంతం. అమె గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయన్నారు. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారన్నారు ప్రధాని.
#WATCH | Odisha: NDA’s presidential candidate Draupadi Murmu sweeps the floor at Shiv temple in Rairangpur before offering prayers here. pic.twitter.com/HMc9FsVFa7
— ANI (@ANI) June 22, 2022
#WATCH | Odisha: NDA’s presidential candidate Draupadi Murmu sweeps the floor at Shiv temple in Rairangpur before offering prayers here. pic.twitter.com/HMc9FsVFa7
— ANI (@ANI) June 22, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..