Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. రోజుకు రూ.417 పెట్టుబడితో కోటి రూపాయల బెనిఫిట్‌

Post Office Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబట్టుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ స్థిరంగా ఉన్నందున భారతదేశంలోని..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. రోజుకు రూ.417 పెట్టుబడితో కోటి రూపాయల బెనిఫిట్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jun 22, 2022 | 11:24 AM

Post Office Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబట్టుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ స్థిరంగా ఉన్నందున భారతదేశంలోని పెట్టుబడిదారులు ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపడం లేదు. మార్కెట్‌ కదలికల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా స్థిరమైన అధిక రాబడిని పొందాలనుకునే వారికి ప్రభుత్వ పొదుపు పథకాలను ఎంచుకోవడానికి ఇది సరైన అవకాశం. భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఈ పథకంలో పన్ను ప్రయోజనం కూడా పొందవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసులో పబ్లిక్‌ ప్రవిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ వల్ల మంచి బెనిఫిట్స్‌ పొందవచ్చు. ఇందుకోసం మీరు ప్రతిరోజూ రూ.417 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ అకౌంట్‌ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మీరు దానిని 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పొడిగించవచ్చు. ఇన్వెస్టర్లు పీపీఎఫ్‌ ఖాతాల్లో సంవత్సరానికి రూ.500 తక్కువగా, ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ (PPF) అనేది భారతదేశంలో అత్యధికంగా వడ్డీ ఉంటుంది. పీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇది బ్యాంకుల ఎఫ్‌డీల కంటే చాలా ఎక్కువ.

ఇందులో మీరు 15 సంవత్సరాల పాటు అంటే మెచ్యూరిటీ వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. అంటే నెలలో రూ. 12500 రూపాయలు అంటే రోజుకు రూ. 417 డిపాజిట్‌ చేయాలి. ఈ మొత్తం పెట్టుబడి 22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మీరు 7.1 శాతం వార్షిక వడ్డీతో ప్రయోజనం పొందుతారు. ఇందులో వడ్డీగా రూ.18.18 లక్షల వరకు వస్తుండగా, మొత్తం 40.68 లక్షల రూపాయలు లభిస్తాయి. అపై మెచ్యూరిటీ కాలాన్ని ఒక్కొక్కటి ఐదు సంవత్సరాల చొప్పున రెండు సార్లు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

మీరు 35 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు, అంటే 25 సంవత్సరాల వరకు ఇలా చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే మొత్తం రూ. 1.03 కోట్ల వరకు ఉంటుంది. ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితం, మొత్తం వడ్డీ దాదాపు 66 లక్షలు అవుతుంది. మీ పదవీ విరమణ వయస్సు వరకు మీరు 25 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తం మొత్తం రూ. 37 లక్షలు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. మీ పెట్టుబడిపై అధిక రాబడిని పొందడానికి నెలవారీ వడ్డీని లెక్కించినందున ప్రతి నెలా 1వ తేదీ నుండి 5వ తేదీ మధ్య డబ్బును డిపాజిట్ చేయడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

PPF ఖాతాను ఎవరు ఓపెన్ చేయవచ్చు..?

జీతం పొందేవారు, స్వయం ఉపాధి పొందేవారు, పెన్షనర్లు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఖాతాను మాత్రమే ఓపెన్‌ చేయగలడు. ఇందులో జాయింట్‌ ఖాతా ఉండదు. పిల్లల తరపున తల్లిదండ్రులు/సంరక్షకులు పోస్టాఫీసులో మైనర్ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ప్రవాస భారతీయులు ఇందులో ఖాతా ఓపెన్‌ చేసేందుకు అవకాశం ఉండదు.

15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి..

మీరు ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తే..

☛ మొత్తం పెట్టిన పెట్టుబడి: 22,50,000

☛ మొత్తం వడ్డీ: రూ.18,18,209

☛ మొత్తం వచ్చే అమౌంట్‌: రూ.40,68,209

మెచ్యూరిటీ కాలం తర్వాత ఐదేళ్ల చొప్పున రెండు సార్లు  పొడిగించుకుంటే.. (25 ఏళ్లు)

మొత్తం పెట్టిన పెట్టుబడి: 37,50,000

☛ మొత్తం వడ్డీ: రూ.65,58,015

☛ మొత్తం వచ్చే అమౌంట్‌: రూ.1,03,08,015 పొందవచ్చు. అంటే కోటి రూపాయలకుపైగా రాబడిని అందుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి