FD Vs RD: ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్.. ఎందులో వడ్డీ ఎక్కువ వస్తుంది..?
స్టాక్ మార్కెట్‌లో అస్థిరత కారణంగా చాలా మంది సురక్షింతమైన పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాంటి వారికి పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఎఫ్‌డీలు మంచి ఎంపికలు అవుతాయి...
స్టాక్ మార్కెట్‌లో అస్థిరత కారణంగా చాలా మంది సురక్షింతమైన పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాంటి వారికి పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఎఫ్‌డీలు మంచి ఎంపికలు అవుతాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లలోనే డబ్బును పొదువు చేస్తారు. ఒకప్పుడు వీటి పొదుపుకు ఆయా శాఖల వద్దకు వెళ్లాల్సి వచ్చేది కానీ.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో పొదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఎంపిక అనేది పెట్టుబడి సమయంలో మీకు ఎంత డబ్బు అందుబాటులో ఉంటుదో దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఎవరైనా వారి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేయాలనుకుంటే చేయాల్సిన ఉత్తమ పొదుపు మార్గం మీ బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్‌ను ప్రారంభిస్తే బాగుటుంది. డబ్బు నిల్వ ఉన్న వారు వడ్డీ రాబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేయవచ్చు.
ఈ డిపాజిట్‌లో డబ్బుకి పొదుపు ఖాతా కంటే కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇస్తారు. అత్యవసర నిధి సృష్టికి, భవిష్యత్తు అవసరాల ఖర్చులకు ఈ ఖాతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి పొదుపుకు పెట్టుబడి సాధనాలు, ఇవి డబ్బు డిపాజిట్ చేసిన కాలానికి స్థిరమైన వడ్డీ రేటుని అందిస్తాయి. గడువు ముగిసినప్పుడు డిపాజిట్ తిరిగి తీసుకోవచ్చు. మీరు క్యుములేటివ్, నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కలిగి ఉండవచ్చు. క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మీరు మెచ్యూరిటీపై అసలు, వడ్డీని కలిపి ఒకేసారి మెచ్యూరిటీ తర్వాత పొందుతారు.