AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌తో ‘షిండే’ భేటీ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు

Maharashtra Political Crisis Updates: మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర సర్కార్‌కు రాజకీయ సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే..

Maharashtra Political Crisis: ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌తో 'షిండే' భేటీ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు
Subhash Goud
|

Updated on: Jun 22, 2022 | 11:24 AM

Share

Maharashtra Political Crisis Updates: మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర సర్కార్‌కు రాజకీయ సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే సూరత్‌ నుంచి గౌహతి చేరుకున్నారు. తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు. పార్టీకి విధేయులని భావించి మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం పెద్ద పెనుగాలి వీచింది. శివసేనపై తిరుగుబాటు చేసిన తర్వాత, ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హోటల్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం షిండేతో పాటు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి గౌహతికి చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో గౌహతి తరలించారు. గౌహతిలోని ఎమ్మెల్యేలంతా బస చేసిన హోటల్‌కు హైలెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

అయితే నిన్న అరగంట వరకు సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో ఫోన్‌లో మాట్లాడుకున్నా.. ఫలితం కనిపించలేదు. బాల్‌థాక్రే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తామంటూ తేల్చి చెప్తున్నారు ఏక్‌నాథ్‌ షిండే. మహరాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే శివసేనలో చీలిక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

సూరత్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఏక్‌నాథ్‌ షిండే.. బాల్‌ థాకరే అనుసరించిన హిందుత్వ విధానాలకు తామే అసలు వారసులమని ప్రకటించారు. హిందుత్వవాదంతో కూడిన శివసేనను వీడలేదని స్పష్టం చేశారు. మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వం గురించి ప్రస్తుతం తాము ఏం మాట్లాడబోమని అన్నారుఆ. నా వెంట మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో 34 మంది శివసేన, 7 మంది స్వతంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్‌తో షిండే భేటీ కానున్నారు. తనతో 2/3 పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, దీంతో శివసేన పార్టీ తనదేనని ఆయన క్లయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు షిండే లేఖ ఇవ్వనున్నారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయనున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు ఉన్న సంఖ్యాబలం 55. ఇందులో 33 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారంటూ ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించుకున్నారు.

బుధవారం ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే శివసేన తిరుగుబాటు శాసన సభ్యులందరూ గుజరాత్‌ను వీడి అసోంకు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి