AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Sisodia: మనీశ్‌ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం భార్య!

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భార్య రూ.100 కోట్ల పురువునష్ట దావా వేసింది. ఈ మేరకు మంగళవారం (జూన్‌ 21) గువహటి సివిల్‌ జడ్జ్‌ కోర్టులో కేసు నమోదైంది. అస్సాం సీఎం..

Manish Sisodia: మనీశ్‌ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం భార్య!
Manish Sisodia
Srilakshmi C
|

Updated on: Jun 22, 2022 | 9:06 AM

Share

Sisodia targets Assam CM for PPE kit deal: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భార్య రూ.100 కోట్ల పురువునష్ట దావా వేసింది. ఈ మేరకు మంగళవారం (జూన్‌ 21) గువహటి సివిల్‌ జడ్జ్‌ కోర్టులో కేసు నమోదైంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్‌ సూట్‌, ఆమె కుమారుడి వ్యాపార భాగస్వామికి అస్సాం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా జూన్‌ 4న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆరోపణలు చేశారు. 2020లో కోవిడ్‌ కేసులు పెరిగిన సమయంలో మార్కెట్‌ రేట్ల కంటే అధిక ధరలకు పీపీఈ కిట్లను పరఫరా చేసేందుకు అస్సాం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చినట్లు సిసోడియా మీడియా సమావేశం ఆరోపించారు. అనంతరం సిసోడియా వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హిమాంత బిశ్వ శర్మ గతంలో అన్నారు.

ఒక్క పైసా ముట్టుకోలేదు.. ఏ పాపం ఎరుగను..

తాజా కేసుపై అస్సాం ముఖ్యమంత్రి ఈ విధంగా వివరణ ఇచ్చారు..’100 ఏళ్ల తర్వాత భారత్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న సమయంలో అస్సాంలో అసలు పీపీఈ కిట్లు అనేవే లేవు. నా భార్య సహృదయంతో ముందుకు వచ్చి 1500ల పీపీఈ కిట్లను ఉచితంగా ప్రభుత్వానికి అందించింది. అందుకుగానూ ఆమె ఒక్క పైసా కూడా తీసుకోలేదని’ వివరించారు. ఈ మేరకు మంగళవారం సిసోడియాపై బిశ్వ శర్మ భార్య కేసు వేశారు. ఈ కేసు నేడు (బుధవారం) మరింత ముందుకు కదిలే అవకాశం ఉందని రినికి భుయాన్‌ తరపు లాయర్‌ పద్మాధర్ నాయక్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆ బిల్లుల మాటేమిటి? ఐతే సిసోడియా ఇందుకు సంబంధించి ఎన్‌హెచ్‌ఎం అస్సాం మిషన్ డైరెక్టర్ ఎస్ లక్ష్మణన్‌ జారీ చేసిన బిల్లును ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో ఈ విధంగా ట్వీట్‌ చేశారు.. ‘గౌరవనీయులైన హిమంత బిశ్వ శర్మ..జేసీబీ ఇండస్ట్రీస్ పేరుతో ఒక్కోకిట్‌ రూ.990ల చొప్పున 5000 కిట్లను కొనుగోలు చేసినట్లు ఈ బిల్లు చెబుతోంది. ఈ కాగితం నిజమా..అబద్ధమా? ఇది అవినీతి కాదా? టెండర్ కొనుగోలు ఆర్డర్‌ను మీ భార్య కంపెనీకి ఇవ్వడం నిజం కాదా?’ అని ప్రశ్నించారు.

సిసోడియా ఆరోపణలపై హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్‌ సూట్‌ గతంలో వివరణ ఇచ్చారు. మహమ్మారి కాలంలో పీపీఈ కిట్లులేకపోవడంతో, నా స్నేహితుడి సహాయంతో దాదాపు 1500ల పీపీఈ కిట్లను ఎన్‌హెచ్‌ఎమ్‌కు ఉచితంగా అందించానని, అందుకు ఎటువంటి సొమ్మును తీసుకోలేదని ఆమె అన్నారు. దీంతో అటు ఢిల్లీ, ఇటు అస్సాం రాజకీయాల్లో వేడి మొదలైంది.