Colombia: కొలంబియా తొలి నల్లజాతి వైస్ ప్రెసిడెంట్‌గా ఫ్రాన్సియా మార్క్వెజ్.. వెనుజులా కంట్లో కన్నీరెందుకు?
కొలంబియ తాజా ఎన్నికల్లో వామపక్ష నేత అయిన గుస్తావో పెట్రో ప్రెసిడెంట్‌గా ఎంపికవ్వగా, ఫ్రాన్సియా మార్క్వెజ్ (Francia Marquez) వైజ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. దీంతో కొలంబియా దేశ చరిత్రలోనే మొట్టమొడటి నల్లజాతి వైస్ ప్రెసిడెంట్‌గా ఫ్రాన్సియా మార్క్వెజ్ పేరు నిలిచిపోనుంది..
first Black vice president Colombia: కొలంబియా ఎన్నికల్లో వామపక్షం ముందంజలో నిలబడి అంచనాలను తారుమారు చేసింది. ఆ దేశ తాజా ఎన్నికల్లో వామపక్ష నేత అయిన గుస్తావో పెట్రో ప్రెసిడెంట్‌గా ఎంపికవ్వగా, ఫ్రాన్సియా మార్క్వెజ్ (Francia Marquez) వైజ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. దీంతో కొలంబియా దేశ చరిత్రలోనే మొట్టమొడటి నల్లజాతి వైస్ ప్రెసిడెంట్‌గా ఫ్రాన్సియా మార్క్వెజ్ పేరు నిలిచిపోనుంది. ఆదివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 50.48 శాతం ఓట్లతో గుస్తావో పెట్రో ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. రోడాల్ప్ హెర్నాండెజ్‌కు 47.26 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. గుస్తావో పెట్రో మూడో సారి ఎన్నికలకు పోటీ చేయగా ఈ సారి ఘన విజయం సాధించారు. అవినీతి వ్యతిరేక పోరాటాల్లో గుస్తావో పెట్రో కీలకపాత్ర వహించాడు. దీంతో కొలంబియాలో సుదీర్ఘకాలంగా చెలరేగుతున్న వామపక్ష సాయుధ పోరాటానికి ముగింపు పలికినట్టయ్యింది. వెనుజులా, క్యూబా, అర్జెంటీనా, చిలీలకు పట్టినగతి తమ దేశానికి పట్టదని, అవినీతిని అరికట్టడంలో తమ నూతన ప్రెసిడెంట్ సమర్ధవంతంగా పనిచేస్తాడని ఆ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు దేశాధినేతలు కూడా పెట్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా కొలంబియాలో 39 మిలియన్ల ప్రజలు ఉండగా దాదాపు 21.6 మిలియన్ల ప్రజలు ఆదివారం జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పెట్రో 40 శాతం, హెర్నాండెజ్ 28 శాతం మేర ఓట్లను గెలుచుకున్నారు. ఫలితాలు కూడా అదే రోజు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ప్రత్యర్ధి హెర్నాండెజ్ ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు. 2019 వెనుజులాతో నుంచి తెగిపోయిన దౌత్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు పెట్రో సముఖత వ్యక్తం చేసున్నాడు. ఐతే పొరుగునున్న వెనుజులా వామపక్ష ప్రభుత్వానికి మాత్రం గుస్తావో పెట్రో గెలుపు మింగుడుపడటం లేదు.