Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మద్యం బాటిళ్లను వరసగా పేర్చి.. జేసీబీతో తొక్కించి.. మందుబాబుల గుండె తరుక్కుపోయే దృశ్యాలు

సాధారణంగా ఒక్క మద్యం సీసా యాక్సిడెంటల్ గా పగిలిపోతేనే గుండె తరుక్కుపోతుంది. అలాంటిది ఒకే సారి వేల సంఖ్యలో మద్యం సీసాలను జేసీబీతో తొక్కేస్తుంటే.. మద్యం ప్రియుల బాధ వర్ణనాతీతం. అయ్యయ్యో అంటూ గుండెలు బాదుకోవడమే తప్పా.....

Andhra Pradesh: మద్యం బాటిళ్లను వరసగా పేర్చి.. జేసీబీతో తొక్కించి.. మందుబాబుల గుండె తరుక్కుపోయే దృశ్యాలు
Wine In Guntur Districct
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 21, 2022 | 6:54 PM

సాధారణంగా ఒక్క మద్యం సీసా యాక్సిడెంటల్ గా పగిలిపోతేనే గుండె తరుక్కుపోతుంది. అలాంటిది ఒకే సారి వేల సంఖ్యలో మద్యం సీసాలను జేసీబీతో తొక్కేస్తుంటే.. మద్యం ప్రియుల బాధ వర్ణనాతీతం. అయ్యయ్యో అంటూ గుండెలు బాదుకోవడమే తప్పా.. ఇంకేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే.. వారు పడే వేదనను మాటల్లో చెప్పలేం. తమ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు సరకు మొత్తాన్ని లైన్ గా పేర్చి, జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశారు. గుంటూరు(Guntur) జిల్లాలో ఈ ఘటన హాట్ టాపిక్ అయ్యింది. గుంటూరు జిల్లాలో అక్రమ మద్యంపై పోలీస్‌ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి కేసులు నమోదు చేసింది. ఈ మేరకు పోలీసులు, ఎస్ఈబీ అధికారులు పట్టకున్న అక్రమ మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు.

గుంటూరులో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. 3,500 మద్యం సీసాలను ఎస్పీ అరిఫ్ హాఫీజ్ నేతృత్వంలో జేసీబీతో తొక్కించారు. ధ్వంసం చేసిన మద్యం బాటిల్స్ విలువ రూ.9 లక్షలు ఉంటుందని ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. పోలీస్ శాఖలో ఎస్ఈబీ ఏర్పాటు చేసిన తరువాత.. గోవా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యంపై దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం అమ్మకాలు జరిగితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మితే కథిక చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ మద్యంతో పాటు నిషేధిత 8 లీటర్ల నాటు సారానూ పోలీసులు ధ్వంసం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి