Andhra Pradesh: ఎల్లుండి తిరుపతి జిల్లాకు సీఎం జగన్.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23(ఎల్లుండి) తిరుపతి(Tirupati) జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం...

Andhra Pradesh: ఎల్లుండి తిరుపతి జిల్లాకు సీఎం జగన్.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
Cm Jagan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 21, 2022 | 5:32 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23(ఎల్లుండి) తిరుపతి(Tirupati) జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. 11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం(AP CM Jagan) ఇనగలూరు చేరుకుంటారు. అక్కడి హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు.. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాల్లో అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉందన్నారు. పైస్థాయిలో అంకితభావంతో ఉంటే 50 శాతం అవినీతి అంతం అవుతుందన్నారు. ఏ ఆఫీస్‌లోనైనా, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి