Telangana: రామరాజ్యం తెస్తామని చెప్పి రావణకాష్టంలా మార్చారు.. కేంద్రం పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్న కేటీఆర్ బీజేపీ నేతలు కులాల మధ్య పంచాయతీ పెడుతున్నారని ఆరోపించారు. అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చి, యువత...

Telangana: రామరాజ్యం తెస్తామని చెప్పి రావణకాష్టంలా మార్చారు.. కేంద్రం పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 21, 2022 | 4:28 PM

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్న కేటీఆర్ బీజేపీ నేతలు కులాల మధ్య పంచాయతీ పెడుతున్నారని ఆరోపించారు. అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చి, యువత పొట్టకొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి రావణకాష్ఠం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోడ్లు ఎలా వేస్తారని హైదరాబాద్‌(Hyderabad) కు చెందిన ఓ కేంద్రమంత్రి అంటున్నారని, వాళ్లు మంచి పనులు చేయకుండా, చేసే వారిని నిందించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చేతనైతే తనపై తనపై, రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టండి గానీ.. ఇంజినీర్లు, కార్మికులపై పెట్టొద్దని కోరారు. రక్షణ రంగానికి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలోనూ అద్భుతంగా ఫ్లైఓవర్‌లు, స్కైవేలు కడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. చేతనైతే సహాయం చేయండి తప్ప మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవద్దని కేటీఆర్ హితవు పలికారు. హైదరాబాద్‌లో 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు.

నగరాభివృద్ధికి రహదారులు, ప్రజారవాణా వ్యవస్థే కీలకం. అగ్నిపథ్‌ విషయంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారు. దేశంలో ఔషధాల తయారీ కోసం ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేశారు. ఐడీపీఎల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా భూములిచ్చింది. ఐడీపీఎల్‌ విషయంలో కేసులు వేయండని ఒక కేంద్రమంత్రి అంటున్నారు. మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి. ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికులపై కేసులు వేయవద్దని కోరుతున్నా. బీజేపీ అధికారంలోకి వచ్చిన 8ఏళ్లలో దేశానికి చేసిందేమీ లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారు. పేదవారికి అండగా ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తాం.

           – కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ మంత్రి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..