Hyderabad: చిన్నారులను వెంటాడుతున్న అనారోగ్యం.. హీల్పా సర్వేలో షాకింగ్ విషయాలు

దక్షిణాది రాష్ట్రాల్లోని చిన్నారులు డేంజర్ జోన్ లో ఉన్నారా? ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాల్లోని పిల్లలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారా? కంటికి కనిపించని రోగాలతో బాధపడుతున్నారా? పట్టుమని పదేళ్లులేని వయస్సులో బ్లడ్ ప్రెషర్ తో ఒత్తిడికి...

Hyderabad: చిన్నారులను వెంటాడుతున్న అనారోగ్యం.. హీల్పా సర్వేలో షాకింగ్ విషయాలు
children health
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 24, 2022 | 4:54 PM

దక్షిణాది రాష్ట్రాల్లోని చిన్నారులు డేంజర్ జోన్ లో ఉన్నారా? ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాల్లోని పిల్లలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారా? కంటికి కనిపించని రోగాలతో బాధపడుతున్నారా? పట్టుమని పదేళ్లులేని వయస్సులో బ్లడ్ ప్రెషర్ తో ఒత్తిడికి గురవుతున్నారా? అవును ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల్లో 90 శాతం మంది ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌ స్టార్టప్‌ సంస్థ ‘హీల్పా’ చేసిన ఆరోగ్య సర్వే చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు. ఆందోళన కల్గిస్తోంది. ఇంతకీ ఎన్నిరోగాలు పిల్లల్ని చుట్టుముట్టాయి. ఎలాంటి ప్రమాదాన్ని తీసుకువస్తున్నాయి. మన పిల్లల్లో లేని రోగంలేదు. ఈ మాట అనడానికి ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ మీ పిల్లలకు ఆరోగ్యపరీక్షలు చేయించి ఎంత కాలమైంది? పిల్లలు చలాకీగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పరీక్షలెందుకంటారా? అయితే.. ఒక్కసారి మీ చిన్నారులను పరీక్షించి చూడండి. సరిగ్గా వినగలుగుతున్నారా? స్పష్టంగా చూడగలుతున్నారా? వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ శక్తి వారిలో ఉన్నదో లేదో గమనించారా? వీరిని పరీక్షించి వాస్తవాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కాదు.. ఆందోళన పడతాం. హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌ స్టార్టప్‌ సంస్థ Healpha ‘హీల్పా’.. నిర్వహించిన సర్వే ఇవే విషయాలను బహిర్గతం చేసింది. మన పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెల్చిచెప్పింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఏడాది పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 3-18 సంవత్సరాల మధ్య వయసున్న 70 వేల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఒక్కొక్కరిలో ఏయే లోపాలు ఉన్నాయో గుర్తించింది. వీటిని క్రోడీకరించి చూడగా 10 శాతం మంది పిల్లలు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. అంటే 90 శాతానికిపైగా పిల్లలు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 17 శాతం మంది పిల్లల్లో హైబీపీ ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 9 శాతం మంది బాలురు, 8 శాతం మంది బాలికలున్నారు. 65 శాతం మంది బరువు తక్కువ లేదా ఎక్కువ ఉన్నారు. అమ్మాయిల్లో 60 శాతం, అబ్బాయిల్లో 71 శాతం మందికి బరువు సమస్య ఉన్నట్టు తేలింది. 90 శాతం మందిలో ఈఎన్టీ లేదా దృష్టిలోపాలు కనిపించాయి. ఒకే కన్నుతో చూడగలిగేవారు (మోనోక్యులర్‌ విజన్‌) 9 శాతం మంది, ఆనిస్మెస్ట్రోఫియా బాధితులు 10 శాతం మంది ఉన్నారు.

మన జీవన శైలి మారిపోయింది. మనల్ని మనమేకాదు. మన పిల్లల్నిసైతం పట్టించుకోలేని స్థితి. మరోవైపు.. కంటికి కనిస్తున్నవాటిని మాత్రమే చూసి, వైద్యం చేయించే స్థితి. ఇలాంటి పరిస్థితులే హీల్పా ఈ సర్వేకు దిగేలా చేశాయి. వివిధ పాఠశాలల్లో ప్రత్యేక టీముల ద్వారా అన్ని పరీక్షలు నిర్వహించారు. వందమందిలో 90 మంది పిల్లలు ఏదో ఒక వ్యాధి లక్షణాలతో ఉన్నారని తేలింది. కేవలం 10శాతం లోపు మాత్రమే ఎలాంటి సమస్యలు లేకుండా కనిపించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని మనం అనుకోవడానికి, శాస్త్రీయంగా నిర్ధారించడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయాన్ని బయటపెట్టడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్నే వినియోగించాం అంటోంది హీల్ఫా సంస్థ. ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా పరిశీలించామంటోంది.

ఇవి కూడా చదవండి

పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే స్పష్టంగా చూడగలగాలి, వినగలగాలి. కానీ వారి ఇంద్రియాలు ఏ స్థితిలో ఉన్నాయో మనం గమనించం. మన శరీరంలో రెండుగా ఉన్న అవయవాల్లో కన్ను, చెవులు, ముక్కు, కిడ్నీ వంటివి ఒకటి పూర్తిగా చెడిపోయేవరకు మనం వాటి పనితీరును చెక్‌ చేయం. ఇదే పెద్ద సమస్యగా మారిపోతోంది. ఈసమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరిచేయకపోతే పెద్ద సమస్యలుగానే కాదు.. వారు అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయలేని స్థితి ఏర్పడుతోందని హెచ్చరిస్తున్నారు. ఈ సర్వేలో ప్రధాన పాత్ర పోషించిన పిల్లల డాక్టర్ విజయశంకర్.

ఇంత పెద్ద సర్వే ను నిర్వహించడానికి ఒక క్రమ పద్దతిని ఎంచుకున్నారు. ప్రతి పిల్లాడికీ పరీక్ష చేసే ఒక పద్దతిని రూపొందించారు. చెవి ముక్కు కన్ను నోరు.. బరువు ఇలా అనేక పారామీటర్లు ఏవిధంగా తీసుకోవాలి.. ఎలా స్పష్టంగా నిర్థారించాలి అనేది ఒక సిలబస్ గా రూపొందించారు. ఈ సర్వేకు క్షేత్ర స్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణతో క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పిల్లలకు ఉన్న అనేక అనారోగ్య సమస్యలను శాస్త్రీయంగా పరిక్షించగలిగామంటున్నారు సర్వేలో పాల్గొన్న హెల్త్ ట్రయినర్ రమ్య. వివిధ పాఠశాలల్లో సేకరించిన విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని … ప్రత్యేకంగా వివిధ విభాగాలుగా కంప్యూటరీకరించారు. వయస్సు…ఆడ-మగ, వ్యాధి, లక్షణాలు.. ఊరు వంటి అనేక వివరాలను ఒక డేష్‌ బోర్డు గా తయారుచేశారు. ఇది ప్రభుత్వాలు నుంచి… స్వచ్చంద సంస్థల వరకూ ఈసమాచారం తీసుకుని… పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఒక మార్గం ఏర్పరిచిందంటున్నారు ఈసర్వే టెక్నికల్ కో ఆర్డినేటర్ వివేక్‌.

మారిన జీవనశైలి, చిరుతిండ్లు, మానసిక ఒత్తిడి, శారీరక వ్యయం తగ్గడం వల్ల పిల్లలకు అనేక వ్యాధులు వస్తున్నట్టు గుర్తించింది సర్వే. డిజిటల్‌ విప్లవంతో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌లో ఆటలు ఆడటం పిల్లలకు అలవాటైంది. దీంతోపాటు ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. డిజిటల్‌ స్క్రీన్‌ చూసే సమయం హద్దు దాటింది. దీంతో పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయనే హెచ్చిరికలే సర్వే ద్వారా బహిర్గతం అవుతున్నాయి. ఈసమాచార సేకరణలో ప్రభుత్వాలు సకరించాయి. అయితే.. తెలంగాణ ప్రభుత్వం పిల్లల ఆరోగ్య విషయంలో ..ఈ రిపోర్టు ద్వారా సరిచేయడానికి మరింత ఉపయోగపడుతోంది అంటోంది హీల్ఫా సంస్థ.

పిల్లలను వెంటాడుతున్న ఈ సమస్య తెలుగు రాష్ట్రాలు.. పక్క రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో దాదాపు 50 కోట్ల మంది పిల్లలను వెంటాడుతోందనే అంచనాలున్నాయి. ప్రత్యేకంగా రెండున్నర ఏళ్ల నుంచి 18 ఏండ్లలోపు వారు సర్వేలు ద్వారా వ్యాధి గ్రస్తులుగా బయపడుతున్నారు. 90 శాతం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నదంటే ఎంత భయంకరంగా ఉన్నామో ఊహించుకోండి. కేవలం ప్రభుత్వం… స్వచ్చంద సంస్థలే కాదు. తల్లిదండ్రులు సైతం.. ఏటా ఒక్కసారైనా తమ చిన్నారులకు బేసిక్‌ హెల్త్‌ చెకప్‌ చేయించాల్సిన అవసరం కన్పిస్తోంది.

Y. గణేశ్

టీవీ9 తెలుగు, హైదరాబాద్.

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి