గంధర్వ టైటిల్‌ వెనుక కారణం అదే.. డైరెక్టర్‌ అప్సర్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు..

అస‌లు గంధ‌ర్వ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? అనే ప్రశ్నపై దర్శకుడు స్పందిస్తూ.. "నేను డిఫెన్స్‌లో స‌ర్వీస్ చేసి తిరిగి వ‌చ్చాక ద‌ర్శక‌త్వం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో పూనె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. ఆ త‌ర్వాత

గంధర్వ టైటిల్‌ వెనుక కారణం అదే.. డైరెక్టర్‌ అప్సర్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు..
Director Apsar
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2022 | 7:39 PM

సందీప్ మాధ‌వ్‌, గాయ్రతి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం `గంధ‌ర్వ`. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్షన్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. అప్సర్ ని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని నిర్మించారు. అతిశ‌యోక్తులు, ప‌గలు ప్రతీకారాలు వంటివి లేకుండా నిజానికి ద‌గ్గర‌గా స‌రికొత్త లోకంలోకి తీసుకెళ్ళి అంద‌రినీ మెప్పించేలా గంధ‌ర్వ చిత్రం తీశాన‌ని దర్శకుడు అప్సర్ తెలియ‌జేస్తున్నారు. . సెన్సార్ పూర్త‌యి జూలై1న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా గంధ‌ర్వ చిత్ర ద‌ర్శకుడు అప్సర్ మంగ‌ళ‌వారంనాడు పాత్రికేయుల స‌మావేశంలో ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.

అస‌లు గంధ‌ర్వ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? అనే ప్రశ్నపై దర్శకుడు స్పందిస్తూ.. “నేను డిఫెన్స్‌లో స‌ర్వీస్ చేసి తిరిగి వ‌చ్చాక ద‌ర్శక‌త్వం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో పూనె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. ఆ త‌ర్వాత ద‌ర్శకుడిగా కొత్త‌ద‌నంగా ఆలోచించాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశాను. ర‌క‌ర‌కాల క‌థ‌లు అనుకున్నాను. కానీ ఏదీ స‌రికొత్త‌గా అనిపించ‌లేదు. ఆ టైంలో ఇజ్రాయిల్‌లో జ‌రిగిన ఓ యదార్థ సంఘ‌ట‌న గురించి తెలుసుకున్నాను. దానినుంచి యాంటీ ఏజ్‌(వ‌య‌స్సు ఎక్కువైనా యంగ్‌గా వుండేలా) పై క‌థ రాయాల‌నిపించింది. అలా యాంటీ ఏజ్ వున్న వ్య‌క్తికి త‌న కుటుంబంతో లింక్ పెడితే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న‌లోంచి గంధ‌ర్వ క‌థ పుట్టింది. నిజానికి ద‌గ్గ‌ర‌గా వుండాల‌ని దీనిపై రెండేళ్ళు ప‌రిశోధ‌న‌ చేశాను. క్ల‌యిమాక్స్ బాగా వ‌చ్చేలా జాగ్ర‌త్త తీసుకున్నాను. 90 శాతం నిజానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది”అన్నారు.

అలాగే, 1971లో వార్ జ‌రుగుతుంది. దానికోసం ఓ ప్రాంతానికి అత‌ను వెళ్ళాలి. మామూలు వ్య‌క్తులు వెళ్ళే ఛాన్స్‌లేదు. అందుకే మిల‌ట్రీ బ్యాక్‌గ్రౌండ్ వుంటేనే అక్క‌డికి వెళ్ళి అక్క‌డ జ‌రిగే అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌కు లింక్ పెట్టి తీశాం. అయితే ఆర్మీ నేప‌థ్యం అనేది కేవ‌లం ఐదు నిముషాలే వుంటుంది. ఇది యూత్‌కు బాగా న‌చ్చే అంశం. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీ ట్రాక్స్‌, సైన్స్ గురించి ఆలోచించేవారు, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాలు మెచ్చేవారికి ఎగ‌బ‌డి చూస్తారు. ఈ క‌థ‌ను ముగ్గురు హీరోల‌కు చెప్పాను. కానీ కొత్త‌వాడిని కావ‌డంతో అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇద్ద‌ర‌యితే క‌థ మాకు ఇచ్చేయండి. వేరే ద‌ర్శ‌కుడితో తీస్తామ‌న్నారు. కానీ నేనే చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. ఆ స‌మ‌యంలో సంగీత ద‌ర్శ‌కుడు ష‌కీల్ ద్వారా సందీప్ మాధ‌వ్ ప‌రిచ‌యం అయ్యారు. త‌ను వంగ‌వీటి, జార్జిరెడ్డి చిత్రాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల‌వారికి బాగా క‌నెక్ట్ అయ్యాడు. అత‌నికి పెద్ద ఇమేజ్ లేదు. ఇలాంటి వాడే నా గంధ‌ర్వ‌లో కెప్టెన్ అవినాష్ పాత్ర‌కు సూట‌వుతాడ‌నిపించి తీసుకున్నాను.

ఇవి కూడా చదవండి

మ‌న‌కు బంగ్లాదేశ్ యుద్ధం 1971లో జ‌రిగింది. ఆ వార్‌లో పాల్గొన‌డానికి వెళ్ళిన వ్య‌క్తి జీవితం లో జరిగిన ఒక సంఘటన వలన అతను తిరిగి ఇంటికి రావడానికి యాభై ఏళ్త‌ళు పట్నుటింది . ఇంటికి వ‌చ్చేస‌నికి 2021 అవుతుంది. అప్ప‌టికే భార్య‌కు 80 ఏళ్ళు, కొడుక్కి 50 వ‌చ్చేస్తాయి. త‌ను మాత్రం యువ‌కుడిగానే వుంటాడు. ఇందులో హాలీవుడ్‌కు సంబంధించిన స‌ర్‌ప్రైజ్ కూడా వుంటుంది. దానికోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే క‌రెక్టే క‌దా అని న‌మ్ముతారు కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి సీన్ ఒకటి ఇందులో ఉంది … పండగ చేసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు