షాకింగ్‌: ప్రేమగా పెంచుకున్న పెంపుడు పిల్లులు.. ఆకలితో చివరకు యజమానినే పీకుతున్నాయి..

ఓ మహిళ తన ఇంట్లో దాదాపు 20 పిల్లుల్ని పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకుంటోంది. కానీ, చివరకు ఆ పిల్లులే ఆమెను పీకుతిన్నాయి. ఈ షాకింగ్‌ ఘటన ..

షాకింగ్‌: ప్రేమగా పెంచుకున్న పెంపుడు పిల్లులు.. ఆకలితో చివరకు యజమానినే పీకుతున్నాయి..
Cats
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2022 | 5:40 PM

ఇటీవలి కాలంలో చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవటం మామూలే అయిపోయింది. అనేక మంది తమకు ఇష్టమైన పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటిపై అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. అయితే, ఇక్కడ కూడా ఓ మహిళ తన ఇంట్లో దాదాపు 20 పిల్లుల్ని పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకుంటోంది. కానీ, చివరకు ఆ పిల్లులే ఆమెను పీకుతిన్నాయి. ఈ షాకింగ్‌ ఘటన రష్యాలో చోటు చేసుకుంది.

రష్యాలోని రోస్టవ్‌లో ఓ మహిళ తన ఇంట్లో పిల్లుల్ని పెంచుకుంటోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20 పిల్లుల్ని పెంచుకుంటోంది. అయితే రెండు వారాల క్రితం సదరు మహిళ ఇంట్లోనే ప్రమాదవశాత్తు కింద పడి మరణించింది. ఆ ఇంట్లో ఇంకా మరెవరూ లేకపోవటంతో ఆమె మృతదేహం అలాగే పడిఉంది. మరోవైపు ఆ పిల్లులకు తిండిపెట్టేవారు లేకుండా పోయారు. అలా రెండు వారాల పాటు ఆకలితో అలమటించిన ఆ పెంపుడు పిల్లలు చివరికి యజమాని మృతదేహాన్ని పీకుతున్నాయి. మృతురాలి సహోద్యోగి అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీన్‌ చూసి షాక్‌తిన్నారు. హుటాహుటినా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు పీక్కు తినగా మృతదేహం లో కొంత భాగం మాత్రమే మిగిలి ఉండటం చూసి పోలీసులే కంగుతిన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ వార్త దవానంలా వ్యాపించింది. నెటిజన్లు సైతం జరిగిన ఘటనపై షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..