మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. భర్త ఆచూకీ చెప్పాలంటూ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు

జూన్ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో ఫోన్ కాల్‌లో చివరి సారిగా మాట్లాడానని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నందున అతనితో కమ్యూనికేట్ చేయడం లేదని పేర్కొంది. దేశ్‌ముఖ్‌కు ప్రాణహాని ఉన్నట్టు తాను అనుమానిస్తున్నట్లు

మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. భర్త ఆచూకీ చెప్పాలంటూ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు
Mr Deshmukh
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2022 | 4:19 PM

మరాఠా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్‌నాథ్ షిండే మరికొంత మంది ఇతర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో గల మెరిడియన్ హోటల్‌కు తరలివెళ్లినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ భార్య అతనిపై మిస్సింగ్ కేసుపెట్టింది. తన భర్తకు ప్రాణహాని ఉందంటూ ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రలోని బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి షిండేతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలలో దేశ్‌ముఖ్‌ కూడా ఒకరు.

ఎమ్మెల్యే దేశ్‌ముఖ్ భార్య ప్రాంజలి అకోలా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాను జూన్ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో ఫోన్ కాల్‌లో చివరి సారిగా మాట్లాడానని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నందున అతనితో కమ్యూనికేట్ చేయడం లేదని పేర్కొంది. దేశ్‌ముఖ్‌కు ప్రాణహాని ఉన్నట్టు తాను అనుమానిస్తున్నట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ్‌ముఖ్ అనారోగ్యంతో ఉన్నారని ఫిర్యాదు చేయడంతో సూరత్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే, మ‌రో వైపు చీఫ్ విఫ్ ప‌ద‌వి నుంచి ఏక్‌నాథ్‌ను శివ‌సేన తొలిగించింది. రెబెల్‌గా మారిన ఏక్‌నాథ్ ప్రస్తుతం సూర‌త్‌లో కొంత మంది ఎమ్మెల్యేల‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అలజడి మొదలైంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అధికారి శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పార్టీకి ఇబ్బందులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి