President Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా.. కీలక ప్రకటన చేసిన జైరాం రమేష్..

22 రాజకీయ పార్టీలు యశ్వంత్‌సిన్హాకు మద్దతు ప్రకటించాయి. శరద్‌పవార్‌ అధ్యక్షతన జరిగిన విపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళే తృణమూల్‌కు రాజీనామా చేశారు యశ్వంత్‌సిన్హా. విపక్షాల భేటీకి టీఎంసీ తరపున అభిషేక్‌ బెనర్జీ హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో..

President Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా.. కీలక ప్రకటన చేసిన జైరాం రమేష్..
Yashwant Sinha
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 21, 2022 | 5:01 PM

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా పేరును ప్రకటించారు. 22 రాజకీయ పార్టీలు యశ్వంత్‌సిన్హాకు మద్దతు ప్రకటించాయి. శరద్‌పవార్‌ అధ్యక్షతన జరిగిన విపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళే తృణమూల్‌కు రాజీనామా చేశారు యశ్వంత్‌సిన్హా. విపక్షాల భేటీకి టీఎంసీ తరపున అభిషేక్‌ బెనర్జీ హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన విపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మజ్లీస్ పార్టీ(MIM) నుంచి ఎంపీ ఇంతియాజ్ జలీల్ కూడా పాల్గొన్నారు. గత సమావేశంలో ఏఐఎంఐఎంను పిలవలేదు. గత సారి పిలవలేదని అందుకే రాలేదని ఎంపీ ఇంతియాజ్ జలీల్ తెలిపారు. సమావేశానంతరం కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హానే అని తాము (ప్రతిపక్ష పార్టీలు) ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అదే సమయంలో, ఈ సమావేశంలో చేరడానికి ముందు యశ్వంత్ ట్వీట్ చేస్తూ, తనకు ఇచ్చిన గౌరవం, ప్రతిష్టకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు. పార్టీలకతీతంగా మనం పెద్ద లక్ష్యం కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

అంతకుముందు విపక్షాలు ముందుకు వచ్చిన ముగ్గురి పేర్లను అభ్యర్థులుగా తిరస్కరించారు. వీటిలో శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లు ఉన్నాయి. యశ్వంత్ సిన్హా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీకి దూరమై ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్‌ సిన్హా కోరారు. ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

సీఎం మమతా బెనర్జీ ట్వీట్..

విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఓకే అవడంతో టీఎంసీ అధినేత, బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

జాతీయ రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హాకు సుదీర్ఘ అనుభవం ఉంది. చంద్రశేఖర్‌, వాజ్‌పేయ్‌ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆర్ధిక , విదేశాంగశాఖలను నిర్వహించారు. 85 ఏళ్ల యశ్వంత్‌సిన్హా బీహార్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి. బీజేపీకి రాజీనామా చేసి కొద్దినెలల క్రితం ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా పేరును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్టు తెలిపారు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌.

జాతీయ వార్తల కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?