AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: సూర్య అసలు పేరెంటో తెలుసా ?.. ఈ పేరు ఎవరు పెట్టారంటే..

ముఖ్యంగా యూత్‏లో సూర్యకు ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. సింప్లిసిటీ.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు సూర్య.

Suriya: సూర్య అసలు పేరెంటో తెలుసా ?.. ఈ పేరు ఎవరు పెట్టారంటే..
Suriya
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2022 | 6:04 PM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya).. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. కోలీవుడ్ స్టార్ అయినా సూర్యకు తెలుగులో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా యూత్‏లో సూర్యకు ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. సింప్లిసిటీ.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు సూర్య. గజిని, సూర్య s/o కృష్ణమన్, రక్త చరిత్ర సిరీస్, సింగం, ఆకాశమే హద్దురా, జైభీమ్ చిత్రాలతో సౌత్ ఆడియన్స్ ను అలరించాడు సూర్య. హీరోయిజం మాత్రమే కాకుండా.. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ హీరో.. దశాబ్ధకాలంగా తన సినిమాలతో తెలుగు, తమిళం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎప్పుడు సూర్య సినిమాల గురించి సరికొత్త అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంటాయి.. కానీ తాజాగా సూర్య పేరు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అవును ఇది నిజం.. ఈ స్టార్ హీరో అసలు పేరు సూర్య కాదంట.. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్.. కానీ అతనికి సూర్య అనే పేరును డైరెక్టర్ మణిరత్నం పెట్టారట..

మణిరత్నం దర్శకత్వంలో సూర్య నెర్రుక్క నెర్, ఆయుత ఎళుతు, నవరస వంటి చిత్రాల్లో నటించారు. అదే సమయంలో డైరెక్టర్ మణిరత్నం ఆయనకు సూర్య అనే పేరును ఇకపై స్క్రీన్ పై ఉపయోగించాలని సూచించారట.. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మణిరత్నం సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించిన పేరు ఇదే కావడం విశేషం.. సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా..తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూర్య స్పెషల్.. శరవణన్ శివకుమార్ అనే పేరు ఇండస్ట్రీలో గందరగోళంగా ఉంటుందని.. సూర్యుడిలా ప్రకాశిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడిగా నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సూర్యకు ఈ పేరు సరిగ్గా సెట్ అయ్యందనే చెప్పుకొవాలి.. ఇటీవల కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు సూర్య. రోలెక్స్ అనే గెస్ట్ రోల్ చేసి థియేటర్లలో సంచలనం సృష్టించాడు.. సూర్య కనిపించిన ఆ చివరి 3 నిమిషాలు విక్రమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పుకోవాలి.. ప్రస్తుతం సూర్య తన తదుపరి సినిమా చిత్రీకరణలలో బిజీగా ఉన్నాడు. అలాగే తాను నటించిన సూరరై పొట్రు చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైతం సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు.. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.