Prince Movie: దీపావళికి రానున్న ప్రిన్స్.. శివకార్తికేయన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన జాతిరత్నాలు డైరెక్టర్..
ఇప్పుడు శివకార్తికేయన్ నేరుగా తెలుగులో మూవీ చేస్తున్నాడు. జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కెవి..అనుదీప్
తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌కు (Sivakarthikeyan) తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తాను నటించిన చిత్రాలు తెలుగులో డబ్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో.. రెమో సినిమాతో టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన ఈ హీరో.. ఆ తర్వాత వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.. ఇప్పుడు శివకార్తికేయన్ నేరుగా తెలుగులో మూవీ చేస్తున్నాడు. జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కెవి..అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు ప్రిన్స్ అనే టైటిల్ ఫిక్స్ చేసి.. ఇటీవలే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉక్రెయిన్ బ్యూటీ మారియా కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రేమ్ జీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. తాజాగా ప్రిన్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో శివకార్తికేయన్, అనుదీప్ సినిమా గురించి ముచ్చటిస్తూ సినిమా ఆలస్యమవడానికి సత్యరాజ్ కారణమంటూ చెప్పుకొచ్చారు.. అలాగే మూవీ విడుదల తేదీ మారడానికి కూడా అతడే కారణమని తెలిపారు.. ఇక వీరి మధ్యలోనే సత్యరాజ్, హీరోయిన్ మరియా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.. ఈ దీపావళికి అంటే అక్టోబర్ 24న ప్రిన్స్ సినిమా తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
#PrinceForDiwali ? here’s the official announcement video!?????https://t.co/Bc849MvWP1#Sathyaraj sir @anudeepfilm #MariaRyaboshapka @MusicThaman @manojdft @Premgiamaren @Cinemainmygenes @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 21, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.