Kiran Abbavaram: ”ఇలాంటి పాయింట్ ని ఎవరూ తీయలేదు”.. ఆసక్తికర విషయాలు పంచుకున్న యంగ్ హీరో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్.. హిట్లు.. ఫ్లాప్ లతో..

Kiran Abbavaram: ''ఇలాంటి పాయింట్ ని ఎవరూ తీయలేదు''.. ఆసక్తికర విషయాలు పంచుకున్న యంగ్ హీరో
Kiran Abbavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2022 | 9:28 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్.. హిట్లు.. ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతున్న నేపధ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ “సమ్మతమే” చిత్ర విశేషాలిని పంచుకున్నారు.

కిరణ్ మాట్లాడుతూ.. దర్శకుడు గోపీనాథ్, నేను నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. హైదరాబాద్ కి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుండి గోపి నాకు పరిచయం. సినిమా పట్ల ఇద్దరికీ ఒకే అవగాహన, ప్యాషన్ వుంది అన్నారు. ఇద్దరం ఒక్కటిగా తిరిగి సినిమాపై ఇంకా అవగాహన పెంచుకుని, నేర్చుకున్నాం. ఈ క్రమంలో నేను ‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చేశాను. గోపి అప్పటికే ఇంకా కథని రాస్తున్నాడు. తను సమయం ఎక్కువ తీసుకుంటాడు. స్క్రిప్ట్ చాలా పగడ్బందీగా తయారైన తర్వాత ‘సమ్మతమే’ స్టార్ట్ చేశాం. చాలా సింపుల్ పాయింట్, ఫ్రెష్ పాయింట్. ఇలాంటి పాయింట్ ని ఎవరూ తీయలేదు. చాలా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాం. ప్రతి సీన్ చాలా వినోదాత్మకంగా వుంటుంది. రెండున్నర గంటలపాటు ఒక ఫ్రెష్ నెస్, బ్రీజీనెస్ వుంటుంది సినిమాలో అన్నారు. అలాగే ట్రైలర్ ఓపెనింగ్ లోనే ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్ష్మీ ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే ‘నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని” నాన్నని అడుగుతాడు. పెళ్లి పై అంత శుభసంకల్పం వున్న ఒక క్యారెక్టర్ కి తన పెళ్లి చూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైయింది ? దాన్ని ఎలా ఎదుర్కున్నాడు ? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపధ్యం వున్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది ? అనే అంశాలు చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. పాటలు కూడా అద్భుతంగా వుంటాయి. శేఖర్ చంద్ర గారు మంచి ఆల్బం ఇచ్చారు. ఏడు పాటలని ఎంజాయ్ చేస్తారు అన్నారు కిరణ్ అబ్బవరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే