Virata Parvam: విరాటపర్వం సినిమాపై తమిళ్ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రానా, సాయి పల్లవిలపై ప్రశంసలు..

నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 17న విడుదలైన సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించగా..

Virata Parvam: విరాటపర్వం సినిమాపై తమిళ్ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రానా, సాయి పల్లవిలపై ప్రశంసలు..
Virata Parvam
Follow us

|

Updated on: Jun 20, 2022 | 1:01 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం (Virata Parvam) సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 17న విడుదలైన సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, ఈశ్వరీ, నివేదా పేతురాజ్ కీలకపాత్రలలో నటించారు. 1990లో సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఆమె పాత్రను ప్రేరణగా తీసుకుని వెన్నెల పాత్రను సృష్టించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. దీనికి ప్రేమను జోడించి విప్లవంతో కూడిన అందమైన ప్రేమకావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ సినిమాపై సాయి పల్లవి, రానా నటనపై ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ వేణు ఉడుగుల అద్భుతంగా తెరకెక్కించారని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంలసలు కురిపించారు. తాజాగా తమిళ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ కూడా విరాట పర్వం సినిమాపై ప్రశంసలు కురిపించారు.

“ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాలలో అత్యుత్తమ తెలుగు సినిమా విరాటపర్వం. డైరెక్టర్ వేణు ఉడుగుల… నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాను రూపొందించినందుకు వారు ప్రశంసలు అందుకోవాలి.. ఈ పాత్రను అంగీకరించి చేసిన రానాకు.. సాయి పల్లవికి ప్రత్యేక ధన్యవాదాలు..” అంటూ ట్వీట్ చేశారు.. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. జూన్ 17న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తోంది. సరళ అనే యువతి పాత్రలో సాయి పల్లవి నటన అందరిని ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?