Gopichand: అందుకే విలన్ పాత్రలు చేయాల్సి వచ్చింది.. హీరో గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం తొలివలపు నిర్మాత ఎ. నాగేశ్వరరావు అని తెలిపారు.. ముందుగా తనపై ఆ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సందేహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు.

Gopichand: అందుకే విలన్ పాత్రలు చేయాల్సి వచ్చింది.. హీరో గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Gopichand
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2022 | 5:36 PM

సినీ పరిశ్రమలో విలన్ పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోలుగా మారిన స్టార్స్ ఎందరో ఉన్నారు.. మోహన్ బాబు, శ్రీకాంత్ వంటి స్టార్స్ సైతం ఒకప్పుడు విలనిజాన్ని పండించి అదరగొట్టారు.. అలా పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టి.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు గోపిచంద్.. తొలివలపు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. జయం సినిమాలో విలన్‏గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిజం, వర్షం మూవీస్ లోనూ విలనిజాన్ని చూపించారు.. ఈ చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పించిన గోపిచంద్ (Gopichand) యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా స్క్రీన్ పై అలరించాడు..ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో విలన్ పాత్రలకు స్వస్తి చెప్పారు.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపిచంద్ తాను విలన్ పాత్రలు ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.

తాను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం తొలివలపు నిర్మాత ఎ. నాగేశ్వరరావు అని తెలిపారు.. ముందుగా తనపై ఆ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సందేహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు.. ఇప్పటివరకు తాను చేసిన చిత్రాలు యజ్ఞం, రణం, లౌక్యం, శంఖం, సాహసం టైటిల్స్ సెంటిమెంట్ తో పెట్టినవి కాదని… చెప్పుకొచ్చారు.. ఇక విలన్ పాత్రలు అనేది కేవలం అప్పుడున్న పరిస్థితుల కారణంగా మాత్రమే చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. వర్షం సినిమా కంటే ముందే ప్రభాస్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. ఇక విడుదలకు సిద్ధమైన పక్కా కమర్షియల్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా దూసుకుపోతున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..