Vijay Thalapathy: బాస్ ఈజ్ బ్యాక్.. విజయ్ సినిమా టైటిల్ వచ్చేసింది.. అదిరిపోయిన దళపతి ఫస్ట్ లుక్..

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో

Vijay Thalapathy: బాస్ ఈజ్ బ్యాక్.. విజయ్ సినిమా టైటిల్ వచ్చేసింది.. అదిరిపోయిన దళపతి ఫస్ట్ లుక్..
Vijay Thalapathy
Follow us

|

Updated on: Jun 21, 2022 | 8:06 PM

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay Thalapathy) తెలుగులో నేరుగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దళపతి కెరీర్ లో 66వ చిత్రంగా రాబోతున్న సినిమాకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే విజయ్ పుట్టిన రోజు (జూన్ 22) న ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ రాబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ షాడో ఫొటోతో డిజైన్ చేసిన పోస్టర్‏ను రిలీజ్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మంగళవారం (జూన్ 21)న విజయ్ సినిమా టైటిల్‏తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్..

విజయ్, వంశీల కలయికలో రాబోతున్న ఈ చిత్రానికి వరిసు అన్న టైటిల్ ఫిక్స్ చేశారు.. బాస్ తిరిగొస్తున్నాడు అంటూ విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ బిజినెస్ మెన్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఫస్ట్ లుక్ లో స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది.” ది బాస్ రిటర్న్స్” అనే ట్యాగ్ లైన్ మరింత ఇంట్రస్టింగ్ గా వుంది. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ పై టైటిల్, పోస్టర్ ఆ అంచనాలని మరింత భారీగా పెంచాయి. పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందే స్పెషల్ ట్రీట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుపనున్నారు మేకర్స్. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు