AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీహైడ్రేషన్కు సంబంధించి ముఖ్యమైన 5 సంకేతాలు.. తెలుసుకొని మిమల్ని మీరు కాపాడుకోండి !

మానవ శరీరం 70% నీటితోనే నిండిఉంటుంది.. ఈ విషయం మనం చిన్నప్పటి నుండి చదువుకున్నదే..అయితే, ఎలాంటి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులపాటు ఉండగలం. కానీ, నీళ్లు తాగకుండా

డీహైడ్రేషన్కు సంబంధించి ముఖ్యమైన 5 సంకేతాలు.. తెలుసుకొని మిమల్ని మీరు కాపాడుకోండి !
Dehydration
Jyothi Gadda
|

Updated on: Jun 21, 2022 | 6:45 PM

Share

మానవ శరీరం 70% నీటితోనే నిండిఉంటుంది.. ఈ విషయం మనం చిన్నప్పటి నుండి చదువుకున్నదే..అయితే, ఎలాంటి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులపాటు ఉండగలం. కానీ, నీళ్లు తాగకుండా బ్రతకటమంటే కష్టమైన పనేమరీ..ప్రతిరోజు కనీసం 2 – 4 లీటర్లు నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండగలరు. కానీ, దురదృష్టవశాత్తు, మనలో కొంతమంది రోజువారీకి సరిపడేంత నీటిని త్రాగరు. అలాంటి వారు తరచూ డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు ఇక్కడ కొన్ని సంకేతాలను సూచించాము. అవేమిటో మీరు కూడా తెలుసుకోండి.

లాలాజలంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. డీహైడ్రేషన్ కారణంగా శరీరం తగినంత లాలాజలాన్ని తయారు చేయకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దాంతో నోటి దుర్వాసనకు దారితీస్తుంది. ప్రజలు ఎక్కువగా ఉదయం దుర్వాసనతో మేల్కొవడానికి కారణం ఇదే. రాత్రిపూట బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల నోటిలో నుండి దుర్వాసన వస్తుంది.

డీహైడ్రేషన్‌కు గురైన వారిలో ముఖ్యంగా నోటి లోపలి భాగం ఎడారి వలె పొడిగా మారినప్పుడు, మీ బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్న భావనను మీ నాలుక కలిగి ఉంటుంది, అంటే మీరు తీవ్రమైన డీహైడ్రేషన్ను ఎదుర్కోబోతున్నరని దాని అర్థం. డీహైడ్రేషన్ మీ మెదడును కష్టతరమైనదిగా ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన అలసటను ప్రేరేపించి నిద్రపోవాలనే కోరికను ఎక్కువగా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

వారి చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. అంతేకాకుండా.. వారిలో యూరిన్ సమస్యలు తలెత్తుతాయి. మైకం వస్తుంది. కండరాలు నొప్పిగా అనిస్తుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. కొందరిలో గుండె వేగంగా కొట్టుకవడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్ కు గురవ్వాలని ఏం లేదు. అన్ని కాలాల్లో శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

కండర తిమ్మిర్లు అనేది మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు అసమతుల్యతకు దారితీసినందున సాధారణంగా ఏర్పడుతుంది. ఇది కూడా డీహైడ్రేషన్ను సూచించే మరొక గుర్తు. మీరు ముదురు పసుపు రంగులో ఉన్న మూత్రమును పోస్తున్నప్పుడు మీకు చాలా మంటగా గానీ అనిపిస్తే, మీరు నీటిని (H2O) చాలా త్వరగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది తీవ్రమైన డీహైడ్రేషన్‌కు సంకేతం.