AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Mukku: ఏజెన్సీ ప్రాంతాల్లో దొరికే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. కనిపిస్తే వదలకండి

గరుడ ముక్కు మొక్క.. దీనిలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఎజెన్సీ ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్కను గిరిజనలు అనేక రకాలుగా ఉపయోగిస్తారు.

Garuda Mukku: ఏజెన్సీ ప్రాంతాల్లో దొరికే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. కనిపిస్తే వదలకండి
Garuda Mukku Plant
Surya Kala
|

Updated on: Jun 21, 2022 | 6:22 PM

Share

Garuda Mukku Benefits: ప్రకృతికి మనిషికి మధ్య విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా మొక్కలు మనిషికి అత్యంత మేలు చేస్తాయి. ఎన్నో ఔషధ మొక్కలు.. వేరు, కాండం, ఆకులు, పువ్వులు ఇలా మొక్కలోని ప్రతి ఒక్క పార్ట్  మానవాళికి ఏదో విధంగా ఉపయోగపదుతూనే ఉంటుంది. అలాంటి మొక్క ఒకటి గరుడ ముక్కు మొక్క.. దీనిలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. దక్షిణ  భారత దేశంలో ఎజెన్సీ ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్కను గిరిజనలు అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను సంస్కృతంలోకాకంగి, కకనస అని.. సాధారణంగా ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు, గద్దాకు చెట్టు, తేలు కొండకు, తేలు కొండి చెట్టు, గొఱ్ఱె జిడ్డాకు వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నట్లు నిలిచి ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చెట్టులో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వ్యాఖ్యానిస్తుంటారు. ఈరోజు గరుడ ముక్కు మొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం..

*మూర్ఛ వ్యాధి రోగులకు గరుడ ముక్కకు మొక్క ఆకుల రసం మంచి మెడిసిన్. *ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి.. క్షయ నివారణకు ఉపయోగిస్తారు. *తేలు విషాన్ని హ‌రించ‌డంలో ఈ ఆకుల రసం దివ్య ఔషధం. తేలు కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని వేసి కట్టుకడితే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది. *కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే.. పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని కాలిన గాయాలపై అప్లై చేయాలి. *ఈ మొక్క ఆకుల ర‌సాన్ని మెడ‌కు రాయ‌డం వ‌ల్ల క్ష‌య వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది. *కీళ్ల నొప్పులు, త‌ల‌నొప్పి, ఛాతి నొప్పి వ్యాధుల నివారణ కోసం.. ఈ మొక్క వేర్ల‌ ఉపయోగించవచ్చు. వేర్లను ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని ఒక గాజు గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఈ నీటిని ఉదయమే తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. *ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. *చర్మం దురదలకు, చర్మవ్యాధులకు ఈ నూనె మంచి ఔషధం. * యాంటీ వైపరిన్ లక్షణాల కారణంగా సాలెపురుగు , విష పురుగుల విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులో ఇచ్చిన అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. అవసరమైన వారు ఆరోగ్య నిపుణుల సలహాలను తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా సందేహాలు ఉంటే ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి.)